Hypder Aadi : అల్లు అర్జున్ ని ట్రోల్ చేయొద్దు.. మెగా ఫ్యాన్స్ కి ఆది రిక్వెస్ట్..!
నంద్యాల వెళ్లి తన ఫ్రెండ్ కి సపోర్ట్ గా ప్రచారంలో పాల్గొన్నాడో అప్పుడే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద ఎటాక్ మొదలు పెట్టారు. మెగా అండ్ పవర్ ఫ్యాన్స్ అంతా కలిసి అల్లు అర్జున్ ని
- By Ramesh Published Date - 02:51 PM, Tue - 23 July 24

ఎప్పుడైతే అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాల వెళ్లి తన ఫ్రెండ్ కి సపోర్ట్ గా ప్రచారంలో పాల్గొన్నాడో అప్పుడే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద ఎటాక్ మొదలు పెట్టారు. మెగా అండ్ పవర్ ఫ్యాన్స్ అంతా కలిసి అల్లు అర్జున్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఐతే మెగా అల్లు ఫైట్ (Mega Allu Fight) గురించి రీసెంట్ గా బన్నీ వాసు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. ఒక సందర్భం కోసం చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
ఐతే లేటెస్ట్ గా అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్స్ పై హైపర్ ఆది స్పందించాడు. ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్ (National Award Winner) అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు అలా చేయవద్దు. వాళ్లంతా బాగానే ఉంటారు. మెగా ఫ్యామిలీకి ఇవి నచ్చవు అని అన్నాడు హైపర్ ఆది. నేషనల్ అవార్డ్ తెచ్చిన నటుడిని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని ఆది చెప్పాడు.
ఐతే మెగా ఫ్యాన్స్ ఆది చెప్పగానే ఆగిపోతారంటే అది భ్రమే అనుకోవాలి. ఓ పక్క అల్లు ఆర్మీ (Allu Army) కూడా మెగా హీరోల మీద మెగా ఫ్యాన్స్ మీద రకరాకల కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఒకటే అనుకున్న మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ పుష్ప 2 తో డిసెంబర్ లో రాబోతున్నాడు. ఈ సినిమా మీద సుకుమార్ అండ్ టీం చాలా ఎఫర్ట్స్ పెడుతుంది. అసలైతే ఆగష్టు 15న రావాల్సిన పుష్ప 2 షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 6కి వాయిదా వేశారు. ఐతే ఈసారి రిలీజ్ మీద డౌట్లు వద్దు కచ్చితంగా అనుకున్న టైం కి వస్తామని అంటున్నారు పుష్ప 2 యూనిట్.
Also Read : Pongal Release : ముగ్గురు మొనగాళ్లు.. సంక్రాంతి ఫైట్..?