Pongal Release : ముగ్గురు మొనగాళ్లు.. సంక్రాంతి ఫైట్..?
సంక్రాంతి (Pongal Release)కి భారీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. స్టార్ రేంజ్ ని బట్టి ఈ ఫైట్ ఉంటుంది. ఐతే ఎప్పటిలానే వచ్చే సంక్రాంతికి కూడా ఈ ఫైట్ షురూ
- By Ramesh Published Date - 02:35 PM, Tue - 23 July 24

సినిమా పరిశ్రమలో ప్రతి స్టార్ తమ సినిమాను ఏదో ఒక పండుగకి రిలీజ్ చేయాలని అనుకుంటారు. ఫెస్టివల్ రోజైతే కలిసి వస్తుంది.. ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఛాన్స్ ఉంటుందని అనుకుంటారు. పండగతో పాటు వీకెండ్ కూడా తోడైతే లాంగ్ రన్ కి భారీ కలెక్షన్స్ కి తోడ్పడతాయి. అందుకే స్టార్ సినిమాలన్నీ కూడా కుదిరితే కచ్చితంగా ఫెస్టివల్ టైం ని రిలీజ్ పెట్టుకుంటారు.
ఐతే ఈ పండగల్లో పెద్ద పండగంటే సంక్రాంతి అనే చెప్పొచ్చు. సంక్రాంతి (Pongal Release)కి భారీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. స్టార్ రేంజ్ ని బట్టి ఈ ఫైట్ ఉంటుంది. ఐతే ఎప్పటిలానే వచ్చే సంక్రాంతికి కూడా ఈ ఫైట్ షురూ అయ్యేలా ఉంది. సంక్రాంతికి ముగ్గురు మొనగాళ్ల ఫైట్ జరగబోతుందని తెలుస్తుంది. అది ఎవరో కాదు టాలీవుడ్ సీనియర్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ అని తెలుస్తుంది.
ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న విశ్వంభర (Chiranjeevi Viswambhara) సినిమా జనవరి 10కి రిలీజ్ లాక్ చేశారు. బాలయ్య కె.ఎస్ బాబీ (NBK109 Movie) సినిమా డిసెంబర్ రిలీజ్ అనుకున్నా అది కూడా సంక్రాంతికి వచ్చేలా ఉంది. ఇక వెంకటేష్ తో అనీల్ రావిపుడి (Venkatesh Anil Ravipudi) చేస్తున్న సినిమా కూడా పొంగల్ రేసులో ఉండేలా ఉంది. ఈ మూడు సినిమాలు సంక్రాంతికి రావడం దాదాపు కన్ఫర్మ్ అని తెలుస్తుంది.
ఐతే వీరితో పాటు ప్రభాస్ రాజా సాబ్ కూడా పొంగల్ రేసులో ఉంటుందని టాక్. సీనియర్ స్టార్స్ ముగ్గురు చాలా కాలం తర్వాత వారి సినిమాలతో పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. మరి సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాల్లో విజయం ఎవరి సొంతమవుతుందో చూడాలి. సంక్రాంతికే కాదు ఈ ఇయర్ డిసెంబర్ లో కూడా భారీ సినిమాలు వస్తున్నాయి. డిసెంబర్ మొదట్లో పుష్ప 2, చివర్ల్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతున్నాయి.
Also Read : Ram Charan Peddi : చరణ్ పెద్దిలో ఆయన ఉన్నాడంటే మాత్రం.. మెగా ఫ్యాన్స్ రచ్చ కన్ఫర్మ్..!