Kingdom : విజయ్ సినిమా చూసేందుకు రష్మిక ఎలా వెళ్లిందో తెలుసా..?
Kingdom : 'కింగ్డమ్' సినిమా ప్రీమియర్ షోకి రష్మిక హాజరు కావాలనుకుందట, కానీ పబ్లిక్ డిస్టర్బెన్స్ జరగకుండా థియేటర్ మేనేజ్మెంట్ అనుమతి నిరాకరించింది. అయితే రష్మిక ఈ సినిమాను మిస్ చేయలేకపోయారు.
- By Sudheer Published Date - 08:02 PM, Sat - 2 August 25

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ రష్మిక (Vijay – Rashmika) మధ్య బంధం గురించి ఎప్పటినుంచో పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఇద్దరూ ఇంతవరకు ఏదీ ధ్రువీకరించకపోయినా, సోషల్ మీడియాలో ఒకరికొకరు ఇచ్చే సపోర్ట్ వల్ల వారి ప్రేమ బంధం గురించి అభిమానులు ఊహించుకుంటున్నారు. ఇప్పుడు విజయ్ నటించిన ‘కింగ్డమ్’ సినిమా విడుదలకు రష్మిక చేసిన స్పెషల్ ట్వీట్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
OG 1st Song : OG ఫస్ట్ సాంగ్ లిరికల్ రిలీజ్..గుస్ బంప్స్ తెప్పించిన థమన్
‘కింగ్డమ్’ సినిమా ప్రీమియర్ షోకి రష్మిక హాజరు కావాలనుకుందట, కానీ పబ్లిక్ డిస్టర్బెన్స్ జరగకుండా థియేటర్ మేనేజ్మెంట్ అనుమతి నిరాకరించింది. అయితే రష్మిక ఈ సినిమాను మిస్ చేయలేకపోయారు. అందుకే ఆవిడ మారువేషం ధరించి, హైదరాబాద్లోని భ్రమరాంబ థియేటర్కు వెళ్లి సినిమా చూసి వచ్చారు. ఈ విషయం తెలిసిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇది ఎంత స్పెషల్ అని ప్రకటించారు.
రష్మిక ‘కింగ్డమ్’ సినిమా విడుదలకు ముందే ఎంతగానో ఎగ్జైటెడ్గా ఉండి, సినిమా రిలీజ్ తర్వాత “మనం కొట్టినం” అనే ట్వీట్ చేశారు. దీనికి విజయ్ రెడ్ హార్ట్ ఎమోజీతో ప్రతిస్పందించారు. ఈ ఇంటరాక్షన్లు వారి బంధాన్ని మరింత బలపరిచాయి. నాగవంశీ కూడా రష్మిక విజయ్ పై ఉన్న ప్రేమను హైలైట్ చేస్తూ, “ఆవిడ అతనికి ఎంత పెద్ద ఫ్యాన్” అని అన్నారు. మీడియా ప్రతినిధులు విజయ్ ని వారి వివాహ శుభవార్త గురించి అడగగా, “మొదట సినిమాను ఎంజాయ్ చేద్దాం” అని నవ్వుతూ జవాబిచ్చారు. ఇప్పుడు సినిమా హిట్ అయ్యింది కాబట్టి ఈ జంట తమ భవిష్యత్తు గురించి ఏదైనా అధికారికంగా ప్రకటిస్తారేమో అభిమానులు ఎదురు చూస్తున్నారు!