Director Sukumar Birthday Special : లెక్కల మాస్టారు..లెక్క తప్పేదెలా..
- By Sudheer Published Date - 10:17 AM, Thu - 11 January 24

చిత్రసీమలో లెక్కల మాస్టారు అంటే టక్కున గుర్తుచ్చే పేరు సుకుమార్ (Director Sukumar ). చిత్రసీమలోకి (Tollywood) అడుగుపెట్టకముందు మ్యాథ్స్ లెక్చర్ గా లెక్కలు చెప్పేవారు..ఆ లెక్కలు..ఇప్పుడు సినిమాల్లో వేస్తూ..లెక్క తప్పేదెలా..రికార్డ్స్ తగ్గేదెలా అనిపిస్తున్నాడు. 1970 – జనవరి 11 న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో సుకుమార్ జన్మించాడు. చిన్నప్పటి నుంచే బుక్స్ చదవడం ఫై ఆసక్తి ఉండేది. గ్రామంలోని గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతూ..స్కూల్ లో కవితలు రాసేవాడు. ఇక కళాశాలలో గణితం బోధించే అధ్యాపకులు లేకపోవడాంతో సుమారు పది మైళ్ళ దూరం వెళ్ళి వేరే అధ్యాపకుడి దగ్గర నేర్చుకున్నాడు. అలా డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తయ్యే సరికి లెక్కల మీద మంచి పట్టు వచ్చింది. తర్వాత తనే జూనియర్లకు నేర్పించడం మొదలుపెట్టాడు. ఒక వైపు చదువుకుంటూ రాజోలులో ట్యూషన్లు చెప్పేవాడు. తర్వాత 1998లో కాకినాడలో ఓ పెద్ద కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది. నెలజీతం 75 వేల రూపాయల పైమాటే. ఈ ఉద్యోగంలో బాగా నిలదొక్కుకున్నా.. మనసు మాత్రం సినిమాలవైపు లాగుతుండేది.
We’re now on WhatsApp. Click to Join.
ఆలా 2000 లో తన తండ్రితో మాట్లాడి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. లెక్కలు..ఎక్కాలు చదవనోళ్లు..అంటే ఏమి చదవనోళ్ళకు కూడా మన లెక్కల మాస్టారు సినిమాలు ఎక్కేస్తుంటాయి. అందరు ట్యూషన్స్ కోచింగ్ సెంటర్లలో ఇస్తే..మన సుకుమార్ మాష్టారు మాత్రం థియేటర్స్ లలో ఇస్తుంటారు. స్టూడెంట్స్ కు క్లాస్ లో చెప్పేది బోర్ కొట్టిస్తే..సుకుమార్ చెప్పేవి బోరే కొట్టించవు. ఇక సుకుమార్ చెప్పిన ఫస్ట్ సబ్జెక్టు ఆర్య (Arya).. ఆర్య అంటే ఫీల్ మై లవ్..అన్నారు. ఆ తర్వాత జగడం ‘ఇట్స్ ఫ్యాషన్’..ఆర్య 2 అంటే నువ్వు నా ఫ్రెండ్ వు రా..నువ్వు ఏమైనా చేయాలా అన్నాడు..100 % లవ్ అంటే కళ్లు కళ్లు ప్లసు..వాళ్లు వీళ్లు మైనస్ అన్నాడు. వన్ నేనొక్కడినే అంటే రాజమౌళి ని సైతం ఫిదా చేసాడు..మధ్యలో ఐ యమ్ ది చేంజ్ అంటే ఇంత చేంజ్ అవుతాడని అనుకోలే..కట్ చేస్తే లవ్ చేయాలా వద్దా..ఇదే నా ఫస్ట్ కిస్ అంటూ కుర్రకారుకు కిక్ ఇచ్చాడు. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో అంటూ సరికొత్త లెక్కలు చూపించి..లెక్కలతో కూడా ప్రేమలు పంచొచ్చని నిరూపించాడు.
ఆ తర్వాత కమర్షియల్ లెక్కలు వేయడం మొదలుపెట్టాడు. రామ్ చరణ్ తో రంగస్థలం తెరకెక్కించి చరణ్ లోని అసలైన లెక్కను బయటకు తీసి అబ్బా అనిపించాడు. రామ్ చరణ్ కెరీర్లో బెస్ట్ క్లాసిక్, ఓ ల్యాండ్ మార్క్ మూవీ గా ఇది నిలిచేలా చేసాడు. గ్రామీణ నేపథ్యంలో, హీరోకు అంగవైకల్యంతో కథను ఆద్యంతం నడిపించిన తీరు అద్భుతం. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులు ఒక ట్రాన్స్ లోకి వెళ్లేలా చేయడం.. ఇంటికి కూడా సినిమాను తీసుకొచ్చే కథనం రంగస్థలం. ఇక కాస్త గ్యాప్ తీసుకొని పుష్ప- ‘The Rise ‘ అంటూ ఎర్రచందన లెక్కలు బయటకు తీసి..రికార్డుస్ లెక్కలు రాసుకోండి అన్నారు. కేవలం ఇండస్ట్రీ లెక్కలే కాదు జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ లెక్క మార్చేసి..నీ యవ్వ తగ్గేదెలా అనిపించాడు.
ప్రస్తుతం పుష్ప రూల్ తో రాబోతున్నాడు. మరి లెక్కల మాష్టారు రూల్..ఎన్ని రూల్స్ బ్రేక్ చేస్తుందో..ఆ లెక్క ఎలా ఉంటుందో చూడాలి..మొత్తం మీద ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా అడుగుపెట్టి..20 వసంతాలలో ఎన్నో లెక్కలు మార్చిన ఈ లెక్కల మాష్టారుకు ”మా hashtagu ” టీం పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తూ.. మరిన్నో అద్భుతమైన సినిమాలు చేసి..ఎన్నో రికార్డ్స్ సృష్టించాలని కోరుతుంది.
Read Also : Tollywood : అక్కడ సినిమాలే ఆడట్లే..అయినా రూ.30 కోట్లు డిమాండ్..