HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dil Raju Press Meet On Pawan Movie

Tollywood : దిల్ రాజు చెప్పిన ఆ నీచులేవారు..?

Tollywood : “పవన్ కళ్యాణ్ సినిమాల విడుదలకు ఎవరూ అడ్డుకోలేదు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక కొందరు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, వాస్తవ పరిస్థితి వేరే” అని అన్నారు

  • Author : Sudheer Date : 26-05-2025 - 4:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dilraju Tollywood
Dilraju Tollywood

టాలీవుడ్‌(Tollywood)లో ఇటీవల థియేటర్ల సమస్యలు, పైరసీ, సమన్వయం లేని వ్యవహారాల నేపథ్యంలో గిల్డ్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో సక్రమ మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ తామేం చేస్తామో చేసేస్తున్నారు అని వాపోయారు. ఇండస్ట్రీకి స్పష్టమైన నాయకత్వం అవసరమని, అన్ని సమస్యలను కలిసి చర్చించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని సూచించారు. “ఇప్పటి పరిస్థితుల్లో ఎవరి దారి వారిదే, ఎవరి అభిప్రాయం వారిదే, ఇది ఇండస్ట్రీకి హానికరం” అంటూ ముక్తకంఠంతో మాట్లాడారు.

Corona : దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు..ప్రజల్లో మొదలైన భయం

తన నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ తొలి రోజే పైరసీకి గురయ్యిందని, దీనివల్ల భారీ నష్టం వాటిల్లిందని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీ చేసిందీ ఒక రెండవ నిర్మాతే కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పరిశ్రమలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారని, వారి వల్ల మొత్తం ఇండస్ట్రీ దెబ్బతింటోందని అన్నారు. థియేటర్ల బంద్ విషయం తప్పుడు ప్రచారమని, తాము థియేటర్లు మూయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం టికెట్ పద్దతులపై వస్తున్న వివాదాలే అసలు సమస్య అని చెప్పారు. మొదటి వారం రెంటు, తర్వాత పర్సెంటేజ్ విధానం కొనసాగుతుండగా, ఎగ్జిబిటర్ల డిమాండ్లు డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదని వివరించారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాలపై జరుగుతున్న ఆరోపణలపై కూడా దిల్ రాజు స్పందించారు. “పవన్ కళ్యాణ్ సినిమాల విడుదలకు ఎవరూ అడ్డుకోలేదు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక కొందరు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, వాస్తవ పరిస్థితి వేరే” అని అన్నారు. సినిమా పరిశ్రమకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతు అవసరమని, ఆ మద్దతు లేకుండా పరిశ్రమ ఎదగలేదని స్పష్టం చేశారు. పరిశ్రమలో అంతర్గత విభేదాలు ఒకదశను దాటి వెలుపల ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చేలా మారితే, అది మొత్తం ఇండస్ట్రీ భవిష్యత్తుకు ప్రమాదకరం అవుతుందని హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dil raju
  • Dil raju press meet
  • Hari hara veera mallu Movie Release
  • Pawan Kalyan
  • tollywood

Related News

Vijay Deverakonda

ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

ఇప్పటికే రష్మిక, విజయ్‌ల హల్దీ వేడుక ఫోటోలు బయటకు వచ్చాయి. అంతకుముందు జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకల చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

  • Nani Pawan

    Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

  • Vijay- Rashmika Wedding

    వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

Latest News

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

  • Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జెన్ జెడ్ విప్లవం

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. కీల‌క ఆట‌గాడికి గాయం?

  • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd