Tollywood : దిల్ రాజు చెప్పిన ఆ నీచులేవారు..?
Tollywood : “పవన్ కళ్యాణ్ సినిమాల విడుదలకు ఎవరూ అడ్డుకోలేదు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక కొందరు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, వాస్తవ పరిస్థితి వేరే” అని అన్నారు
- By Sudheer Published Date - 04:52 PM, Mon - 26 May 25

టాలీవుడ్(Tollywood)లో ఇటీవల థియేటర్ల సమస్యలు, పైరసీ, సమన్వయం లేని వ్యవహారాల నేపథ్యంలో గిల్డ్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో సక్రమ మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ తామేం చేస్తామో చేసేస్తున్నారు అని వాపోయారు. ఇండస్ట్రీకి స్పష్టమైన నాయకత్వం అవసరమని, అన్ని సమస్యలను కలిసి చర్చించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని సూచించారు. “ఇప్పటి పరిస్థితుల్లో ఎవరి దారి వారిదే, ఎవరి అభిప్రాయం వారిదే, ఇది ఇండస్ట్రీకి హానికరం” అంటూ ముక్తకంఠంతో మాట్లాడారు.
Corona : దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు..ప్రజల్లో మొదలైన భయం
తన నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ తొలి రోజే పైరసీకి గురయ్యిందని, దీనివల్ల భారీ నష్టం వాటిల్లిందని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీ చేసిందీ ఒక రెండవ నిర్మాతే కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పరిశ్రమలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారని, వారి వల్ల మొత్తం ఇండస్ట్రీ దెబ్బతింటోందని అన్నారు. థియేటర్ల బంద్ విషయం తప్పుడు ప్రచారమని, తాము థియేటర్లు మూయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం టికెట్ పద్దతులపై వస్తున్న వివాదాలే అసలు సమస్య అని చెప్పారు. మొదటి వారం రెంటు, తర్వాత పర్సెంటేజ్ విధానం కొనసాగుతుండగా, ఎగ్జిబిటర్ల డిమాండ్లు డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదని వివరించారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాలపై జరుగుతున్న ఆరోపణలపై కూడా దిల్ రాజు స్పందించారు. “పవన్ కళ్యాణ్ సినిమాల విడుదలకు ఎవరూ అడ్డుకోలేదు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక కొందరు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, వాస్తవ పరిస్థితి వేరే” అని అన్నారు. సినిమా పరిశ్రమకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతు అవసరమని, ఆ మద్దతు లేకుండా పరిశ్రమ ఎదగలేదని స్పష్టం చేశారు. పరిశ్రమలో అంతర్గత విభేదాలు ఒకదశను దాటి వెలుపల ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చేలా మారితే, అది మొత్తం ఇండస్ట్రీ భవిష్యత్తుకు ప్రమాదకరం అవుతుందని హెచ్చరించారు.