Singer Kalpana: సూసైడ్ చేసుకోలేదు.. సింగర్ కల్పన క్లారిటీ
మార్చి 3న తన కూతురైన దయ ప్రసాద్‌కి, తనకు మధ్య తన చదువు విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. కూతురిని హైదరాబాద్‌లో చదువుకోమని చెప్పగా.. అందుకు ఆమె నిరాకరించినందున మనస్పర్దలు వచ్చినట్లు కల్పన చెప్పినట్లు సమాచారం.
- By Gopichand Published Date - 02:59 PM, Wed - 5 March 25

Singer Kalpana: సింగర్ కల్పన (Singer Kalpana) ఆరోగ్య పరిస్థితిపై KPHB పోలీసులు వివరణ ఇచ్చారు. కూతురు విషయంలో మనస్పర్థల వల్లే నిద్ర మాత్రలు వేసుకుందని పోలీసులు స్పష్టం చేశారు. ఆత్మహత్యయత్నం చేసుకోలేదని, కూతురు విషయంలో డిస్టర్బ్ అయి నిద్ర మాత్రలు వేసుకున్నట్లు కల్పన చెప్పిందని పోలీసులు వివరించారు. పోలీసుల స్టేట్మెంట్‌లో ఈ మేరకు సింగర్ కల్పన చెప్పినట్లు తెలుస్తోంది. సింగర్ కల్పన తన ఫ్యామిలీతో ఎర్నాకుళం జిల్లాలో నివాసం ఉంటున్నారు. గత 5 సంవత్సరాల నుండి సింగర్ కల్పన ఆమె భర్తతో వర్టెక్స్ ప్రేవేలజే, నిజాంపేట్ రోడ్డు KPHB, హైదరాబాద్ నందు 43 విల్లాలో నివాసం ఉంటున్నారు.
మార్చి 3న తన కూతురైన దయ ప్రసాద్‌కి, తనకు మధ్య తన చదువు విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. కూతురిని హైదరాబాద్‌లో చదువుకోమని చెప్పగా.. అందుకు ఆమె నిరాకరించినందున మనస్పర్దలు వచ్చినట్లు కల్పన చెప్పినట్లు సమాచారం. మార్చి 4న కల్పన ఎర్నాకుళం నుండి హైదరాబాద్‌కి ఉదయం 11:45 గంటలకు ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి వచ్చే సరికి సుమారు 2 అయినట్లు తెలిపారు. ఈ తర్వాత ఎంత ప్రయత్నించిన తనకు నిద్ర పట్టకపోవడంతో ZOL Fresh నిద్ర మాత్రలను వేసుకున్నట్లు కల్పన పేర్కొన్నారు. అయినా నిద్ర పట్టకపోవడంవతో తర్వాత ఇంకో (10) నిద్ర మాత్రలు వేసుకోవడముతో అపస్మారక స్థితి కి వెళ్లిపోయినట్లు కల్పన వివరించారు. ఆ తరువాత ఏమి జరిగిందో తనకు తెలియదని పేర్కొన్నారు.
Also Read: Allu Arjun: ఐదుగురు హీరోయిన్స్ తో అల్లు అర్జున్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్న అట్లీ?
భర్త ప్రసాద్.. కల్పనకు ఎంత ఫోన్ చేసిన ఫోన్ స్పందించకపోవడంతో కాలనీ వెల్ఫేర్ మెంబర్స్‌కి ఫోన్ చేసి చెప్పటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారు డయల్ 100కి ఫోన్ చేసి చెప్పగా KPHB పోలీసులు కాలనీ వెల్ఫేర్ మెంబర్స్ సహాయంతో తలుపులు తట్టగా ఎంతకూ తీయకపోవడంతో వెనుక వైపున గల కిచెన్ డోర్ ద్వారా లోపలికి ప్రవేశించి, బెడ్ రూమ్‌లో అపస్మారక స్థితి లో ఉన్న కల్పనని దగ్గరలోగల హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఉదయం కల్పన అపస్మారక స్థితి నుండి కొలుకొని పైన జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. తను ఎటువంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఈ సంఘటనలో ఎవరీ ప్రేమేయం లేదని క్లారిటీ ఇచ్చారు. తనకు, తన కూతురికి జరిగిన విషయంలో నిద్ర పట్టకపోవడంతో అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకోవడం వలనే ఇలా జరిగిందని ఆమె పేర్కొన్నారు.