Devara : ఎన్టీఆర్ బర్త్ డేకి ‘దేవర’ నుంచి సాంగ్ రావడం కష్టం.. పాటకి బదులుగా..
ఎన్టీఆర్ బర్త్ డేకి 'దేవర' నుంచి సాంగ్ రావడం కష్టమని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సాంగ్ లిరికల్ వీడియో..
- By News Desk Published Date - 12:12 PM, Wed - 15 May 24

Devara : కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. రెండు భాగాలుగా రూపొందుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే చిన్న గ్లింప్స్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ గ్లింప్స్ తోనే ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసారు.
ఇక ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉండడంతో ఈ మూవీ నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ ని ఆడియన్స్ ఆశిస్తున్నారు. దానికి తగ్గట్లే మేకర్స్ కూడా మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా సాంగ్ వస్తుంది అంటూ హింట్ ఇస్తూ ఇటీవల ఓ ట్వీట్ వేశారు. అయితే ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏంటంటే.. బర్త్ డేకి సాంగ్ రావడం కష్టమని తెలుస్తుంది. అనిరుద్ ఇవ్వాల్సిన అవుట్ పుట్ ఇచ్చేశారట.
ప్రస్తుతం లిరికల్ వీడియోని డిజైన్ చేస్తున్నారట. అక్కడే ఆలస్యం అయ్యేలా కనిపిస్తుందట. రెండు వెర్షన్స్ తో లిరికల్ వీడియోని కట్ చేస్తున్నారట. ఆ రెండు పూర్తి అయిన తరువాత.. రెండిటిలో ఏది బాగుంటే అది రిలీజ్ చేస్తారంట. అనుకున్న సమయానికి అవి పూర్తీ అయ్యి సిద్ధమైతే.. బర్త్ డేకి సాంగ్ వచ్చేస్తుంది. ఒకవేళ వర్క్ అవ్వకుంటే.. సాంగ్ ప్రోమోని రిలీజ్ చేస్తారంట. మరి పుట్టినరోజు బహుమతిగా మేకర్స్ ఏం ఇస్తారో చూడాలి.
కాగా ఈ సినిమాని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 27న రిలీజ్ అవ్వాల్సిన పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పోస్టుపోన్ అయితే.. దేవర ప్రీపోన్ అయ్యి సెప్టెంబర్ 27నే వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.