Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం
- Author : Vamsi Chowdary Korata
Date : 06-05-2026 - 10:08 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి మరణవార్త తెలుగు, తమిళ సినీ పరిశ్రమలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందడం చిత్ర సీమకు తీరని లోటు. మూడు దశాబ్దాలుగా ‘క్లీన్ ఎంటర్టైన్మెంట్’కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన, ‘రాజా’, ‘సూర్యవంశం’, ‘సుస్వాగతం’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో వారధిలా ఉంటూ ఎందరో కొత్త దర్శకులను, నటీనటులను పరిచయం చేసిన ఆయన మరణం పట్ల ఇరు పరిశ్రమల అగ్ర నటులు, సాంకేతిక నిపుణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి హఠాన్మరణంతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. దశాబ్దాల కాలంగా ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై రెండు భాషల్లోనూ కుటుంబ విలువలకి పెద్దపీట వేస్తూ ఆయన నిర్మించిన చిత్రాలు కోట్లాది మంది ప్రేక్షకులను అలరించాయి. ఇటు తెలుగులో ‘రాజా’, ‘సూర్యవంశం’, ‘సుస్వాగతం’, ‘నువ్వు వస్తావని’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘శివరామరాజు’, ‘సింహరాశి’ వంటి క్లాసిక్ సినిమాలతో, అటు తమిళంలో అగ్ర హీరోలందరితోనూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఆయన మరణం ఇరు పరిశ్రమలకు ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక గొప్ప నిర్మాతగానే కాకుండా, ఎందరో ప్రతిభావంతులైన దర్శకులను, నటీనటులను పరిచయం చేసిన ఆయన నిష్క్రమణ సినీ లోకానికి ఎప్పటికీ పూడ్చలేని తీరని లోటు అంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాని వెలిబుచ్చుతున్నారు.
Deeply heartbroken to hear about the sudden and tragic loss of Legendary producer R.B. Choudary garu.
I have known him for many years and was recently associated with him on my film “𝐆𝐨𝐝 𝐅𝐚𝐭𝐡𝐞𝐫” through Super Good Films. He has shaped the careers of many talented… pic.twitter.com/8AXgqF5hew
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 5, 2026
లెజెండరీ ప్రొడ్యూసర్ ఆర్.బి. చౌదరి గారి విషాదకర మరణవార్త వినడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయనతో నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ ద్వారా నా ‘గాడ్ ఫాదర్’ సినిమా విషయంలో ఆయనతో కలిసి పనిచేశాను. ఎందరో ప్రతిభావంతులైన దర్శకులు, నటుల వృత్తి జీవితాలను ఆయన తీర్చిదిద్దారు, ఎన్నో అద్భుతమైన కథలను వెండితెరకు పరిచయం చేశారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి మాటలకు అతీతమైనది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ఊహించని నష్టాన్ని తట్టుకునే శక్తిని ఆ దేవుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
శ్రీ ఆర్ బి చౌదరి గారి మరణం దిగ్భ్రాంతికరం
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత శ్రీ ఆర్ బి చౌదరి గారు మరణం దిగ్భ్రాంతి కలిగించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 5, 2026
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత ఆర్.బి. చౌదరి గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్తను నమ్మలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపారంపై ఆయనకు సాధికారత సొంతం. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలు ఉండేలా చిత్రాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆర్.బి. చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Deeply saddened to know that one of our most renowned producer, a thorough gentleman, #RBChoudhry Sir is not among us anymore. His untimely demise is shocking. Have done quite a number of films under his banner. He was one of the most respected member of the film fraternity.… pic.twitter.com/1O9ffh2QKi
— KhushbuSundar (@khushsundar) May 5, 2026
నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆర్.బి. చౌదరి గారు తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో మంది నటులకు, సాంకేతిక నిపుణులకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన క్రమశిక్షణ, నిర్మాతల పట్ల ఆయనకున్న నిబద్ధత ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే తీరు, ఆ దృఢమైన కరచాలనం ఆయనలోని ఆత్మీయతకు నిదర్శనం. తెలుగు, తమిళం అని తేడా లేకుండా భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.