Bigboss : ఛాన్స్‌ల కోసం పడుకున్నా తప్పులేదంటున్న బిగ్ బాస్ బ్యూటీ
Bigboss : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్నో కొత్త ముఖాల్లో ఒకరైన దీక్షా పంత్, తన కెరీర్ ప్రారంభంలోనే ఆకట్టుకునే అందం, నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
- By Kavya Krishna Published Date - 10:27 AM, Fri - 29 August 25

Bigboss : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్నో కొత్త ముఖాల్లో ఒకరైన దీక్షా పంత్, తన కెరీర్ ప్రారంభంలోనే ఆకట్టుకునే అందం, నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ‘వరుడు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత రచ్చ, ఒక లైలా, గోపాలా గోపాలా, శంకరాభరణం, సోగ్గాడే చిన్ని నాయన, బంతిపూల జానకి, ఈగో వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినీ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే స్థాయి విజయాన్ని సాధించలేకపోయినా, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో పాల్గొనడం ద్వారా మంచి క్రేజ్ సంపాదించారు.
బిగ్ బాస్ హౌస్‌లో దీక్షా తన అందం, మైండ్ గేమ్, సరళమైన వైఖరితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పోటీదారుల మధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత మాత్రం ఆమెకు పెద్ద అవకాశాలు రాలేదు. దాదాపు 8 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న దీక్షా, చివరిసారి ‘ఈగో’ సినిమాలో కనిపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దీక్షా, ఇప్పుడు సినిమాల కంటే మోడలింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టానని తెలిపారు. “ఫ్యాషన్ రంగంలో కూడా అవకాశాలు విస్తరించాయి. నా కెరీర్‌కి మోడలింగ్ బాగా సూట్ అవుతుందని భావిస్తున్నాను. అందుకే ఎక్కువగా ఆ దిశలోనే కేంద్రీకరిస్తున్నాను” అని వివరించారు.
Cloudburst In Uttarakhand : ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్
అదే ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను, సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించగా, దీక్షా స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇక్కడ ఇద్దరికీ ఇష్టం ఉంటే.. మిగతావారికి సమస్య ఎందుకు? నేను అయితే ఇంతవరకు అలాంటి అనుభవం ఎదుర్కోలేదు. పర్సనల్‌గా నేను ‘హ్యాండ్ ఇన్ హ్యాండ్’ విధానానికి ఒప్పుకోను. మొదట్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు కొందరు వేరుగా ప్రవర్తించారు. నేను నో అన్న వెంటనే రిజెక్ట్ చేసేవారు. అవకాశాల కోసం అందరితో క్లోజ్‌గా ఉండటం నాకు సాధ్యం కాదు. ఇదే కారణంగా నేను నటిగా పూర్తిస్థాయి విజయాన్ని అందుకోలేకపోయాను” అని తెలిపారు.
ఆమె ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. కొందరు దీక్షా ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఆమె అనుభవాలపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపై సినిమాల్లో కనిపించే ఆలోచన ఉందా? అని అడిగిన ప్రశ్నకు దీక్షా, “బాగున్న స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తాను. కానీ రెగ్యులర్‌గా సినిమాలు చేయాలనే ప్రణాళిక మాత్రం లేదు. ప్రస్తుతం మోడలింగ్‌నే ప్రాధాన్యత ఇస్తున్నాను” అని చెప్పింది.
Heavy Rain : ఈ 5 రోజులు మీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది – ఐఎండీ