Comedian Seshu : ప్రముఖ కమెడియన్ శేషు మృతి
- By Sudheer Published Date - 07:06 PM, Tue - 26 March 24
చిత్ర సీమలో వరుస విషాదాలు నమోదు అవుతూనే ఉన్నాయి. పలు ఆరోగ్య సమస్యలతో ప్రతి ఇండస్ట్రీ లలో ఎవరు ఒకరు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ్ (Tamil) చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ శేషు (Comedian Seshu) (60) కన్నుమూశారు. 10 రోజుల క్రితం గుండెపోటు (Heart Attack)కు గురైన ఆయన.. చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
శేషు పూర్తి పేరు లక్ష్మీ నారాయణన్ శేషు (Lakshmi Narayan Seshu). లొల్లు సభ అనే కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయనను లొల్లు సభ శేషు అని కూడా పిలుస్తారు. తమిళంలో ధనుశ్ తుళ్లువదో ఇలామై, వేలాయుధం, A1, పారిస్ జయరాజ్, డిక్కీలోనా, గుల్ గుల్, బిల్డప్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ్ లో 30కి పైగా చిత్రాల్లో నటించిన శేషు..నటుడు సంతానంతో గొప్ప స్నేహం ఉంది. అందుకే ఆయన నటించిన ప్రతి సినిమాలో శేషు ఉంటాడు. ఇక ఈ మధ్య సంతానం హీరోగా నటించిన వడక్కుపట్టి రామసామి లో కూడా శేషు నటించి మెప్పించాడు. అదే ఆయన చివరి చిత్రం.
కరోనా మహామ్మారి సమయంలో చాలామందికి పేదలకు, అనాథలకు శేషులు సాయం చేశారు. మార్చి 15వ తేదీన గుండె పోటుతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. దాదాపు పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన చికిత్స కోసం చాలా ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఇతర నటీనటులు విరాళాలు సేకరించి.. ఆయనకు చికిత్స కోసం ఖర్చు చేశారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్స్ తీవ్రంగా శ్రమించారు కానీ కాపాడలేకపోయారు.ఇక శేషు భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నట్లు సమాచారం. శేషు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Happy Days : మళ్లీ వస్తున్న ‘హ్యాపీడేస్’