HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ambati Insulting Comments

రాయడానికి వీలులేని విధంగా చంద్రబాబు పై అంబటి బూతులు ల**దగ్గరి నుండి దిగలేదు

ఐదేళ్ల పాలనలో బూతుల రాజకీయాలకే పరిమితమైన నేతలు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పంథాను అనుసరించడం వల్ల వారికి ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు

  • Author : Sudheer Date : 31-01-2026 - 2:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rambabu Comments
Rambabu Comments

Ambati Rambabu : రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు వాడే భాషా పరిమితులు దాటినప్పుడు అది ప్రజాస్వామ్యానికే అవమానంగా మారుతుంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరియు నారా లోకేష్‌లను లక్ష్యంగా చేసుకుని చేసిన అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. గుంటూరు గోరంట్ల వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన లడ్డూ కల్తీ వ్యహారపు ఫ్లెక్సీని తొలగించే క్రమంలో ఆయన ప్రదర్శించిన తీరు, పోలీసులు అడ్డుకుంటున్నా కారులో నుంచి తల బయటపెట్టి మరీ బూతులు మాట్లాడటం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఇలాంటి అభ్యంతరకర భాషను వాడటం ఆయన సంస్కారానికే ప్రశ్నార్థకంగా మారింది.

గోరంట్లలోని ఒక ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్న సమయంలో, అంబటి రాంబాబు తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఈ ఘటనను ఒక వేదికగా మలుచుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో పోలీసులు ఆయనను అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో మీడియా ముందు ముఖ్యమంత్రి కుటుంబంపై బండబూతులు అనడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ నేతల భాషను, ప్రవర్తనను గమనించి తగిన బుద్ధి చెప్పినప్పటికీ, ఇంకా అదే ధోరణిని కొనసాగించడం వారి పతనావస్థకు నిదర్శనమని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.

అంబటి రాంబాబు చేసిన ఈ ఘోరమైన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఐదేళ్ల పాలనలో బూతుల రాజకీయాలకే పరిమితమైన నేతలు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పంథాను అనుసరించడం వల్ల వారికి ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరైన పద్ధతి కాదని, ఇలాంటి భాషను వాడే నేతలకు చట్టపరమైన శిక్షలతో పాటు ప్రజలు కూడా తగిన రీతిలో ‘ట్రీట్మెంట్’ ఇవ్వాలనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu
  • Ambati Rambabu -chandrababu
  • Ambati Rambabu comments
  • Ambati Rambabu insulting comments
  • nara lokesh
  • ycp

Related News

Minister Lokesh

విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

మంత్రి లోకేశ్ ఆదేశాలతో యంత్రాంగం పరుగులు పెట్టింది. విద్యార్థిని అడిగిన వెంటనే నిధులు మంజూరు కావడంతో ఏకంగా రూ.18 లక్షల వ్యయంతో CC రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.

  • Kutami Govt

    అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

Latest News

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

  • Diabetes : డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్

  • Sigma Advanced Systems Limited : ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై సిగ్మా పట్టు

  • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

  • పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్ర‌భావం?!

Trending News

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd