Happy Days : మళ్లీ వస్తున్న ‘హ్యాపీడేస్’
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో 2007 లో వచ్చిన హ్యాపీ డేస్ మూవీ మరోసారి యూత్ ను ఆకట్టుకునేందుకు వస్తుంది.
- Author : Sudheer
Date : 26-03-2024 - 6:56 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) లో రీ రిలీజ్ (Re Release) ట్రేడ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయినా చిత్రాలను మరోసారి రీ రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఇప్పటీకే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా యూత్ ను ఆకట్టుకున్న చిత్రాలు ఎన్నో విడుదలయ్యాయి. తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో 2007 లో వచ్చిన హ్యాపీ డేస్ (Happy Days) మూవీ మరోసారి యూత్ ను ఆకట్టుకునేందుకు వస్తుంది. బీటెక్ లైఫ్, విద్యార్థుల మధ్య స్నేహం, ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ మూవీ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మిక్కీజే మేయర్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.
We’re now on WhatsApp. Click to Join.
కాలేజీ రోజుల్లో గడిపే మధుర క్షణాలను కళ్లకు కట్టెల చూపించి శేఖర్ కమ్ముల ఆకట్టుకున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ కాలేజ్ డేస్ రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికి ఈ సినిమా బుల్లితెర ఫై అలరిస్తూ ఉంటుంది. అలాంటి గొప్ప చిత్రం ఇప్పుడు మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను ఏప్రిల్ 12న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, రాహుల్ కీలక పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వర్సెస్ లోను భారీ వసూళ్లు రాబట్టింది. మరి ఈ సినిమా ఇప్పుడు ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Read Also : Sanjay Dutt : సంజయ్ డిమాండ్ బాగుంది.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?