Colors Swathi On Divorce : విడాకులఫై కలర్స్ స్వాతి స్పందన
ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారని, అందువల్ల మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం
- Author : Sudheer
Date : 26-09-2023 - 4:14 IST
Published By : Hashtagu Telugu Desk
కలర్స్ స్వాతి (Colors Swathi)..ఈ పేరును కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కలర్ ప్రోగ్రాంతో తనపేరునే కలర్స్ స్వాతి గామార్చుకున్న ఈమె..తెలుగులో ఎన్నో మంచి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. 2018 లో వికాస్ వాసు (Vikas Vaasu)తో ఏడు అడుగులు వేసి సినిమాలకు దూరమైంది. పెళ్లి (Colors Swathi Wedding) చేసుకొని విదేశాలకే పరిమితమైన ఈ అమ్మడు..అప్పటి నుండి రెండు , మూడుసార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చింది.
ఇక చాల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ మీడియా ముందుకు కనువిందు చేస్తుంది. అయితే…ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారని, అందువల్ల మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో విడాకుల వార్తల ఫై స్పందించింది.
తాజాగా ఈమె ‘మంత్ ఆఫ్ మధు’ (Month Of Madhu) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటించాడు. అక్టోబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న స్వాతికి విడాకుల ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె రియాక్ట్ కాక తప్పలేదు. ”ఈ కార్యక్రమానికి, ఆ ప్రశ్నకు సంబంధం లేదు. అనవసరం అని నా అభిప్రాయం. నేను సమాధానం చెప్పను” అని స్వాతి తేల్చి చెప్పింది. మరి స్వాతి విడాకులు తీసుకుందా..? లేదా అనేది మాత్రం అలాగే ఉండిపోయింది.
Read Also : Malkajgiri BRS Candidate : మల్కాజ్ గిరి బిఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎవర్ని దింపుతాడో..?