Devara : 125 మిలియన్స్ ను చుట్టేసిన ‘చుట్టమల్లే’ సాంగ్
ఈ పాటకు ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 125 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని చిత్రబృందం ప్రకటించింది
- By Sudheer Published Date - 09:06 PM, Fri - 30 August 24

దేవర సినిమాలోని ‘చుట్టమల్లే’ సాంగ్ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ‘దేవర’ (Devara). ఎన్టీఆర్ (NTR) తో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ మూవీ ని తెరకెక్కించిన కొరటాల శివ(Koratala Shiva)..మరోసారి ఎన్టీఆర్ తో దేవర పేరుతో రెండు పార్ట్స్ గా భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్ రికార్డు వ్యూస్ తో సంచలనం రేపుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ పాటకు ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 125 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని చిత్రబృందం ప్రకటించింది. ఒక్క తెలుగులోనే 92 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ పాట రిలీజైనప్పటి నుంచి యూట్యూబ్లో ట్రెండింగ్ నం.1గా ఉందని పేర్కొంది. ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మిగతా సాంగ్స్ విడుదలకి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో థర్డ్ సింగిల్, మూడు వారంలో ఫోర్త్ సింగిల్ విడుదలయ్యే అవకాశముంది.
Read Also : SA Sampath Kumar : ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ నియామకం