SA Sampath Kumar : ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ నియామకం
ఏపీ ఏఐసీసీ సెక్రటరీగా గణేశ్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీగా పలక్ వర్మ, తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శులుగా విష్ణునాథ్, విశ్వనాథ్, ఛత్తీస్‌గఢ్ ఏఐసీసీ సెక్రటరీగా సంపత్ కుమార్
- By Sudheer Published Date - 08:13 PM, Fri - 30 August 24

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏఐసీసీ సెక్రటరీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అలాగే ఛత్తీస్ గఢ్, తమిళనాడు, పుదుచ్చేరికి సైతం కార్యదర్శులను నియమిస్తూ ప్రకటన చేసింది. ఏపీ ఏఐసీసీ సెక్రటరీగా గణేశ్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీగా పలక్ వర్మ, తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శులుగా విష్ణునాథ్, విశ్వనాథ్, ఛత్తీస్‌గఢ్ ఏఐసీసీ సెక్రటరీగా సంపత్ కుమార్, తమిళనాడు-పుదుచ్చేరి కార్యదర్శిగా సూరజ్ హెగ్గేకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. గుజరాత్‌కు AICC సెక్రటరీగా తెలుగు నేత ఉషానాయుడు, జార్ఖండ్‌కు AICC సెక్రటరీగా సిరివెల్ల ప్రసాద్ నియామకం అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో మహారాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శి పని చేసిన సంపత్ కుమార్ (SA Sampath Kumar)..మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ లో సంస్థాగతంగా NSUI నుంచి ఏఐసీసీ వరకు బాధ్యతలు నిర్వహించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గా, రాష్ట్ర నాయకులుగా పనిచేసి ఎంతో గుర్తింపు పొందారు. సంపత్ కుమార్ 20 జూన్ 1972న జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, చిన్న తాండ్రపాడు గ్రామంలో ఆనందరావు & కె.టి. లూషమ్మ దంపతులకు జన్మించాడు. 1987లో పదవ తరగతి, 1987-1989 వరకు ఇంటర్మీడియట్, 1989-1992 వరకు మహబూబ్‌నగర్‌లోని ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాల నుండి బీఎస్సీ, 1992-1993 వరకు మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ విద్యా కళాశాలలో బి.ఇడి పూర్తి చేశాడు.
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సంపత్.. 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అలంపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి మందా శ్రీనాథ్ పై 57419 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర బాల కార్మిక సలహా మండలి సభ్యుడిగా, మహారాష్ట్ర ఇంచార్జిగా పని చేశాడు. సంపత్ కుమార్ 2018 & 2023 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2023లో కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులుగా పని చేశాడు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. హబూబ్‌నగర్ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ప్రకటించింది. ఇక ఇప్పుడు మరోసారి ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ నియమించింది అధిష్టానం.
Read Also : Covid : భారత్‌కి మరో కోవిడ్ వ్యాప్తి సిద్దంగా ఉండాలి..!