Chiranjeevi – Venkaiah Naidu: ఒకరినొకరు సత్కరించుకున్న వెంకయ్య నాయుడు, చిరంజీవి.. ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) అలాగే మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి (Venkaiah Naidu) ఈ పద్మ విభూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే.
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2024 - 12:53 IST
Published By : Hashtagu Telugu Desk
Chiranjeevi – Venkaiah Naidu : తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) అలాగే మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి (Venkaiah Naidu) ఈ పద్మ విభూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. దీంట్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi), వెంకయ్య నాయుడుకి (Venkaiah Naidu) భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ అవార్డుని ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
దాంతో రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ప్రముఖులు వెంకయ్య నాయుడుకి అలాగే మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలుపుతున్నారు. ఇక నిన్నటి రోజున వీరిద్దరి పేర్లు ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. కొందరు పర్సనల్ గా వెళ్లి మరీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇది ఇలా ఉంటే అభిమానులు కుటుంబ సభ్యులు వెంకయ్య నాయుడు చిరంజీవికి అభినందనలు తెలుపుతుండగా తాజాగా వీరిద్దరూ ఒక చోట కలుసుకుని ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు పద్మ విభూషణులు ఒకేచోట చేరారు.
మెగాస్టార్ చిరంజీవి నిన్న సాయంత్రం వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు. అలా ఇద్దరు ఒకరినొకరు సత్కరించుకున్నారు. చిరంజీవి, వెంకయ్య నాయుడు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సంతోషకరమైన క్షణాలను వెంకయ్యనాయుడు గారితో పంచుకున్నాను. ప్రతిష్టాత్మకమైన గౌరవం అందుకున్నందుకు తోటి గ్రహీతలుగా ఒకరినొకరు అభినందించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. దీంతో ఇద్దరు పద్మ విభూషణులు, తెలుగు వారికి గర్వకారణమైన ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫోటోలో కనిపించడంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Shubh Muhurat : ఫిబ్రవరిలో శుభకార్యాలు, కొత్త పనులకు శుభవేళలివే..