Chiranjeevi New Projects : మెగాస్టార్ బర్త్ డే సందర్బంగా..మెగా ప్రాజెక్ట్ ల ప్రకటన
నేడు తన పుట్టిన రోజు సందర్బంగా తన కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించారు
- By Sudheer Published Date - 12:06 PM, Tue - 22 August 23
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (Chiranjeevi Birthday )సందర్బంగా చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ (Chiranjeevi New Projects Announced ) లను ప్రకటించి అభిమానుల్లో సంబరాలు నింపారు మేకర్స్. చిరంజీవి నేడు 68 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తనకు 68 ఏళ్లు వచ్చినప్పటికీ..ఏమాత్రం ఆయనలో జోష్ తగ్గలేదు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు. అలాగే డాన్సులు , ఫైట్స్ , కామెడీ , ఎమోషన్స్ ఇలా అన్ని కోణాలను చూపిస్తూ ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు.
తాజాగా నేడు తన పుట్టిన రోజు సందర్బంగా తన కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించారు. రీసెంట్ గా భోళా శంకర్ (Bhola Shankar) తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు..తన 156వ (Chiranjeevi 156 Movie) సినిమాను తన కూతురు సుస్మిత కొణిదెలకు చెందిన గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్లో చేస్తున్నాడు. ఈ విషయాన్నీ నేడు అధికారిక ప్రకటన చేస్తూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో 4 దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ, లక్షలాది మందికి భావోద్వేగాలను కలిగించే వ్యక్తిత్వం, తెర ముందూ, తెరవెనకా ఒకేలా పిలవబడే వ్యక్తి.. అంటూ చిరు గొప్పతన్నాన్ని రాసుకొచ్చారు. ఓ డస్క్రీ కలర్లో ఉన్న కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి తన మీసాలను పదునుగా చేస్తూ చురకత్తులాంటి చూపులతో గంభీరంగా చూస్తూ కనిపించారు. ఇంకా ఈ పోస్టర్ బ్యాక్గ్రౌండ్లో ఆయన నటించిన గత సినిమాల పేర్లన్నీ కనిపించడం విశేషం. మరి ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు..కాస్ట్ & క్రూ ఏంటి వివరాలు తెలియాల్సి ఉంది.
అలాగే చిరంజీవి 157 (Chiranjeevi 157 Movie) వ చిత్రాన్ని కూడా ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో బింబిసారా ఫేమ్ వశిష్ఠ (Malladi Vassishta) డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఈ మూవీ నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రం కూడా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని అర్ధమవుతుంది. ఒక స్టార్ సింబల్ తో ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. అలాగే ఆ స్టార్ లో పంచభూతాలైన.. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశంను చూపించారు. ఈ పంచభూతాల శక్తి మెగాస్టార్ అంటూ ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. దాంతో ఈ మూవీ ఫై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ కు సంబంధించిన వివరాలు తెలుపనున్నారు. మొత్తం మీద చిరు బర్త్ డే సందర్బంగా రెండు మెగా ప్రాజెక్ట్స్ వచ్చి అభిమానులను సంతోష పెట్టాయి.
Read Also : Rashmika-Vijay: రష్మిక తో మళ్లీ నటించాలనుంది: విజయ్ దేవరకొండ
Tags
Related News
Tollywood : హీరోలు జీరోలు..కమెడియన్స్ హీరోలు
టాలీవుడ్ (Tollywood) లో ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల పెద్దగా సక్సెస్ లు కొట్టలేకపోతున్నారు. దీనికికారణం మూస కథలను ఎంచుకోవడమే. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కథ కొత్తగా ఉంటె తప్ప థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడడం లేదు. ఎంత పెద్ద హీరోయినా..అభిమాన నటుడైన సరే కథ బాగుందా..కొత్త ఉందా అనేది చూస్తున్నారు. ఏమాత్రం బాగాలేదంటే రెండో రోజు నుండే థియేటర్స్ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఈ