Rashmika-Vijay: రష్మిక తో మళ్లీ నటించాలనుంది: విజయ్ దేవరకొండ
గీతగోవిందం, డియర్ కామ్రేడ్ తో అలరించిన ఈ జంటను మరోసారి చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు.
- By Balu J Published Date - 11:43 AM, Tue - 22 August 23

తెరపై విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ‘గీత గోవిందం’లో వీరి జోడీ అందరినీ అలరించింది. ముఖ్యంగా ప్రేమికులు బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాదు.. ఆ సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘డియర్ కామ్రేడ్’ మూవీ నిరాశపర్చినప్పటికీ వారి కెమిస్ట్రీ మాత్రం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ జంట కలిసి పనిచేయడం లేదు. కానీ అభిమానులు వారి కలయిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి వారు డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు కూడా వినిపించాయి.
ఇటీవల కోయంబత్తూరు పర్యటన సందర్భంగా ఒక అభిమాని విజయ్ దేవరకొండను రష్మికతో మళ్లీ జతకట్టే అవకాశం గురించి అడిగాడు. ఖుషి తమిళ వెర్షన్‌ను ప్రమోట్ చేయడానికి తమిళనాడు వచ్చిన విజయ్ దేవరకొండ మరోసారి ఆమెతో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం రష్మిక, తనని ఒకే ప్రాజెక్ట్‌లో నటింపజేసే ఆలోచనలో దర్శకులు లేరని విజయ్ అన్నాడు.
రష్మిక మందన్న ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీగా ఉండగా, మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంలో కనిపించనున్నారు. వారు ఉద్దేశపూర్వకంగా కలిసి పనిచేయకుండా ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ తో అలరించిన ఈ జంటను మరోసారి చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు. విజయ్ స్టేట్ మెంట్ తో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో వీరి కాంబోను చూడొచ్చు.
Also Read: MLC Kavitha: మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని బిజెపి రెండుసార్లు మోసం చేసింది!