HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Heartfelt Letter On Demise Of Sirivennela

Chiranjeevi:’సిరివెన్నెల’ మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపట్ల మెగాస్టార్ చిరంజీవి తన బాధను వ్యక్తం చేశారు. సిరివెన్నెల మరణవార్త తెలియగానే ఆయన పార్థివదేహాన్ని చూడడానికి చిరంజీవి వచ్చారు. ఇక మంచి మిత్రుడిని కోల్పోయానని చిరు తెలిపారు.

  • By Siddartha Kallepelly Published Date - 10:06 PM, Tue - 30 November 21
  • daily-hunt
Dya4roqwwaiikgz Imresizer

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపట్ల మెగాస్టార్ చిరంజీవి తన బాధను వ్యక్తం చేశారు. సిరివెన్నెల మరణవార్త తెలియగానే ఆయన పార్థివదేహాన్ని చూడడానికి చిరంజీవి వచ్చారు. ఇక మంచి మిత్రుడిని కోల్పోయానని చిరు తెలిపారు.

అంతకుముందే సిరివెన్నెల మరణంపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన విచారం వ్యక్తం చేసాడు. సిరివెన్నెల మనకిక లేడని, సాహిత్యానికి ఇది చీకటి రోజని చిరు అభిప్రాయపడ్డారు. నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారని, మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారని, ఆయన్ని ఎప్పటికీ మిస్పవుతామని చిరు తెలిపారు.

సిరివెన్నెలతో తనకున్న స్నేహాన్ని, జర్నీని తెలుపుతూ చిరు ఒక సుధీర్ఘ లెటర్ పోస్ట్ చేసారు. చిరు రాసిన పోస్ట్ అయన మాటల్లోనే మీకోసం.

‘ఆరు రోజుల క్రితం హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడానికి వెళుతున్న సమయంలో సిరివెన్నెల తనతో మాట్లాడారు. ఆరోగ్యం బాగుండలేదని తెలిసి, మద్రాసులో ఒక మంచి హాస్పిటల్ ఉందని, ఇద్దరం వెళదాం.. అక్కడ జాయిన్ అవుదురు గానీ అని అన్నాను. ఆయన మిత్రమా ఈ రోజు ఇక్కడ జాయిన్ అవుతాను.. నెలాఖరులోపు వచ్చేస్తాను. నువ్వు అన్నట్టుగానే అప్పటికి ఉపశమనం రాకపోతే, ఖచ్చితంగా మనిద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అన్నారు. అలా వచ్చేస్తానని వెళ్లిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారు అనేది ఊహించలేకపోయాను. చాలా బాధాకరమైన విషయం ఇది. ఆయనకు అన్ని రకాల మెరుగైన వైద్యం, అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఆ రోజు ఆయనకు ఫోన్ చేస్తే ఎంతో హుషారుగా మాట్లాడారు. అంత ఉత్సాహంగా దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడితే ఖచ్చితంగా ఏమీ జరగదు అని నేను అనుకున్నాను. ఆ సమయంలో వారి కుమార్తెతో కూడా మాట్లాడాను. మీతో మాట్లాడాక నాన్నగారు చాలా ఉత్సాహంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. నన్ను సీతారామశాస్త్రిగారి కుటుంబంలో వాళ్లు ఎంతగా అభిమానిస్తారో అనే విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. ఇద్దరూ ఒకటే వయసు వాళ్లం కావడంతో ఎప్పుడూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండేవారు. ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా మిత్రమా అంటూ పలకరిస్తూ మాట్లాడతారు.

తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించారు. వేటూరిగారి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన భాషను అర్థం చేసుకోవడానికి కూడా మనకున్న పరిజ్ఞానం సరిపోదు. అంతటి మేధావి ఆయన. ఎన్నో అవార్డులు, రివార్డులు తన కెరియర్లో అందుకున్న ఆయనకు 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందివ్వగా, ఆ రోజున నేను వ్యక్తిగతంగా ఆయన ఇంట్లో చాలా సేపు గడిపాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వ్యక్తిని కోల్పోతే సొంత బంధువుని కోల్పోయినట్లుగా చాలా దగ్గరి ఆత్మీయుడిని కోల్పోయినట్టే అనిపిస్తోంది. గుండె తరుక్కుపోతోంది, గుండెంతా బరువెక్కి పోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఎంతో మందిని శోక సముద్రంలో ముంచి దూరమైపోయిన ఆయన నిజంగా మనందరికీ, ఈ సాహత్య లోకమంతటికి అన్యాయం చేశారు. ముఖ్యంగా మా లాంటి మిత్రులకు అన్యాయం చేసి వెళ్లిపోయారు.

ముఖ్యంగా నాకు అత్యంత ఇష్టమైన రుద్రవీణ సినిమాలోని ‘తరలిరాద తనే వసంతం, తన దరికిరాని వనాల కోసం’ అనే పాటలోలాగా ఆయనే మన అందరినీ వదిలి తరలి వెళ్ళిపోయారు. ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు కానీ, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు కానీ ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. కానీ తన పాటలతో ఇంకా ఆయన బతికే ఉన్నారు. తన పాట బతికున్నంతకాలం సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా బతికే ఉంటారు. ఆయన సాహిత్యంలో శ్రీశ్రీగారి పదును కనపడుతుంది. ఈ సమాజాన్ని మేలుకొలిపే విధంగా ఒక శక్తి ఉంటుంది. ఈ సమాజంలో తప్పు ఎత్తి చూపే విధంగా ఆయన సాహిత్యం ఉంటుంది. ఈ సమాజానికి పట్టిన కుళ్ళు కడిగిపారేసే విధంగా ఉంటుంది. అంత పవర్ ఆయన సాహిత్యంలోనే కాదు ఆయన మాటల్లోనే కాదు, ఆయన కలంలోనే కాదు, ఆయన మనస్తత్వం కూడా దాదాపు అలాగే ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప కవి మళ్లీ మనకు తారసపడటం కష్టమే. ఆయన ఆ తల్లి సరస్వతీ దేవి వడిలో సేద తీరుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’

'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు pic.twitter.com/dcRFE4XPXn

— Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021

https://telugu.hashtagu.in/wp-content/uploads/2021/11/lQJR3sF9UAkDySbH.mp4


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • heartfelt letter
  • sirivennela
  • tollywood

Related News

Actor Rahul Ramakrishna

Actor Rahul Ramakrishna: గాంధీని అవ‌మానించిన టాలీవుడ్ న‌టుడు రాహుల్ రామకృష్ణ!

రాహుల్ రామకృష్ణపై గాంధీజీని అవమానించిన ఆరోపణల మేరకు పోలీసులు తగిన చర్యలు తీసుకొని, కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.

    Latest News

    • Mukesh Ambani: ఫోర్బ్స్ 2025.. భారత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ అగ్రస్థానం!

    • Govt Job : ‘ప్రతి ఫ్యామిలీకి ప్రభుత్వ ఉద్యోగం’ చట్టం – తేజస్వి హామీ

    • Womens Cricket: మహిళా క్రికెట్‌కు ఐసీసీ కీల‌క ప్రకటన!

    • PM Kisan Yojana: దీపావళిలోపు పీఎం కిసాన్ నిధులు.. ఈ 5 పనులు చేయకపోతే డబ్బులు రావు!

    • TVK : మరోసారి మీటింగ్ పెడితే బాంబు పెడతా.. విజయ్ కి బెదిరింపులు!

    Trending News

      • Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో కన్ఫర్మ్ టికెట్ తేదీ మార్చుకునే సదుపాయం!

      • UPI Update: యూపీఐలో ఈ మార్పులు గ‌మ‌నించారా?

      • Carney- Trump: కెనడా, అమెరికా మధ్య కీలక భేటీ.. ట్రంప్ నోట విలీనం మాట‌!

      • Gold: బంగారం ఎందుకు తుప్పు ప‌ట్ట‌దు.. కార‌ణమిదేనా?

      • Top ODI Captains: వన్డే క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌లు వీరే.. టీమిండియా నుంచి ఇద్ద‌రే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd