Chiranjeevi – NTR : రాఖీ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి చిరంజీవి ఏమ్మన్నారంటే..
రాఖీ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి చిరంజీవి నిర్మాతతో ఒక మాట అన్నారట. ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో..
- By News Desk Published Date - 11:40 AM, Fri - 3 May 24

Chiranjeevi – NTR : తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది దర్శకనిర్మాతలు.. తమ సినిమా పై చిరంజీవి అభిప్రాయం, అభినందనలు కోరుకుంటుంటారు. ఇందుకోసమే చిరంజీవికి ప్రత్యేకంగా షో వేయించి తమ సినిమాని చూపిస్తారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ’ సినిమాని కూడా చిరంజీవికి ప్రత్యేక షో వేయించారు. 2006లో రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించగా, కే ఎల్ నారాయణ నిర్మించారు.
ఈ దర్శకనిర్మాతలు ఇద్దరికీ చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం ఉంది. ఈ అభిమానంతోనే చిరంజీవికి ఈ సినిమాని ప్రివ్యూ వేసి చూపించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఎమోషనల్ కోర్ట్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ లో ఎన్టీఆర్ భారీ డైలాగ్ ఒకటి చెబుతారు. ఆ సీన్ లో ఎన్టీఆర్ యాక్టింగ్, అలాగే ఆ పెద్ద డైలాగ్ ని ఎన్టీఆర్ చెప్పిన విధానం చూసి చిరంజీవి మైమర్చిపోయారట. సినిమా తరువాత ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. ‘క్లైమాక్స్ లో తారక్ చేసినట్లు ఇంకెవరు చేయలేరు’ అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కే ఎల్ నారాయణ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కాగా ఈ నిర్మాత ఇప్పుడు టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాజమౌళి, మహేష్ బాబు SSMB29 చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రాజమౌళి ఈ నిర్మాతతో సినిమా చేస్తానని 15 ఏళ్ళ క్రిందటే మాట ఇచ్చారట. ఆ మాట నెరవేర్చడానికి రాజమౌళికి ఇన్నేళ్లు పట్టింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయట. కానీ రాజమౌళి మాత్రం కే ఎల్ నారాయణకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆ ఆఫర్స్ అన్నిటిని కాదని కే ఎల్ నారాయణ కోసం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారట. కాగా ఈ సినిమా ఆగష్టు లేదా సెప్టెంబర్ లో లాంచ్ చేసి షూటింగ్ స్టార్ట్ చేస్తామని నిర్మాత చెప్పుకొచ్చారు.
Also read : Rajamouli Mahesh : రాజమౌళి మహేష్.. 15 ఏళ్ల క్రితమే చేయాల్సిందా..?