Rajamouli Mahesh : రాజమౌళి మహేష్.. 15 ఏళ్ల క్రితమే చేయాల్సిందా..?
Rajamouli Mahesh గుంటూరు కారం తర్వాత మహేష్, RRR తర్వాత రాజమౌళి ఈ ఇద్దరు కలిసి SSMB 29 సినిమా చేయబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ ఈ సినిమా
- Author : Ramesh
Date : 03-05-2024 - 10:42 IST
Published By : Hashtagu Telugu Desk
Rajamouli Mahesh గుంటూరు కారం తర్వాత మహేష్, RRR తర్వాత రాజమౌళి ఈ ఇద్దరు కలిసి SSMB 29 సినిమా చేయబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే కె.ఎల్ నారాయణ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు. ఆయన ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు చేశారు. దొంగాట, ఇంట్లో ఇల్లాలు వంటిలో ప్రియురాలు, క్షణ క్షణం, హలో బ్రదర్స్, రాఖీ సినిమాలను నిర్మించిన కె.ఎల్ నారాయణ నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే మహేష్ తో సినిమా చేయాలని ఆయనకు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు.
రాజమౌళి కూడా కెరీర్ మొదట్లో సూపర్ హిట్లు కొడుతున్న టైం లో ఆయనతో సినిమా చేయాలని నారాయణ అడ్వాన్స్ ఇచ్చారు. అయితే అప్పటి రాజమౌళి మహేష్ ల ఇమేజ్ కు ఇప్పటి ఇమేజ్ కు చాలా తేడా ఉంది. అడ్వాన్స్ ఇచ్చి ఎంతోకొంత ముట్ట చెప్పే ఛాన్స్ ఉన్నా కూడా రాజమౌళి మహేష్ ఇచ్చిన మాట ప్రకారం కె.ఎల్ నారాయణ నిర్మాణంలోనే సినిమా చేయాలని అనుకున్నరు..
అలా 15 ఏళ్ల క్రితమే నారాయణ ప్రొడక్షన్ లో చేయాల్సిన రాజమౌళి మహేష్ సినిమా ఇన్నాళ్లకు సెట్స్ మీదకు వెళ్తుంది. రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచర్స్ మూవీగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇంటర్నేషనల్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి.