Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ మూవీలో ఎన్నో గెస్ట్ రోల్స్.. చిరంజీవి సైతం..!
ప్రభాస్ 'కల్కి' మూవీలో ఎన్నో గెస్ట్ రోల్స్ ఉండబోతున్నాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తో పారు మెగాస్టార్ చిరంజీవి..
- By News Desk Published Date - 06:26 AM, Wed - 22 May 24

Kalki 2898 AD : ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడి’ భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని ఈ సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. ఈ స్టార్స్ తో పాటు మరికొంతమంది నటీనటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారని మేకర్స్.. ముందు నుంచి చెప్పుకొస్తూనే ఉన్నారు. ఈక్రమంలోనే పలువురు నటీనటులు పేర్లు వినిపిస్తూ వచ్చాయి.
తాజాగా చిరంజీవి పేరు కూడా వినిపిస్తుంది. ఈ సినిమాని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహానటి సినిమాలో కూడా పలువురు హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ కొన్ని ముఖ్య పాత్రల్లో కనిపించి గెస్ట్ అపిరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కల్కి సినిమాలో కూడా అదే ఫార్మేట్ ని నాగ్ అశ్విన్ ఫాలో అవుతున్నారట. ఈ సినిమాలో చాలామంది స్టార్స్ పలు గెస్ట్ రోల్స్ తో ఆడియన్స్ ని పలకరించనున్నారట.
ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా గెస్ట్ అపిరెన్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయనున్నారట. ఇప్పటికే అమితాబ్, కమల్ వంటి స్టార్స్ తో భారీ హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు చిరంజీవి కూడా నటించబోతున్నారనే వార్తతో మరింత హైప్ ని క్రియేట్ చేసుకుంటుంది. మరి ఈ సినిమాలో ఏఏ స్టార్ కనిపించబోతున్నారో చూడాలి. కాగా ఈ మూవీని జూన్ 27న రిలీజ్ చేయబోతున్నారు.
నేడు (మే 22) హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ భారీ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ లో బుజ్జి పాత్రని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు. ఇక ఈ ఈవెంట్ లో ఏడు కోట్ల ఖర్చుతో తయారు చేసిన ఎగిరే కారుని, రెండు కోట్లతో తయారు చేసిన బుల్లెట్లు పేల్చే హీరో జాకెట్ ని ఆడియన్స్ కి చూపించబోతున్నారట. అలాగే మరెన్నో వింతలను ఈ ఈవెంట్ లో ఆడియన్స్ కి చూపించబోతున్నారట.