N Convention : 2016 లోనే ‘N కన్వెన్షన్’ ఫై రేవంత్ పిర్యాదు
నాగార్జున, నల్ల ప్రీతమ్ రెడ్డి కలిసి సంయుక్తంగా హైదరాబాద్ మాదాపూర్లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో N-కన్వెన్షన్ సెంటర్ను 2015లో నిర్మించారు
- By Sudheer Published Date - 11:19 AM, Sat - 24 August 24

హైదరాబాద్ (Hyderabad) లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRA ) ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తుండడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా ఇలానే దూకుడుగా ముందుకెళ్లి పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలు కూల్చాలని నెటిజన్లు కోరుతున్నారు. ఆయా నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఇలానే ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి చెందిన స్థలాలు, చెరువులను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు ఉదయం నాగార్జున (Nagarjuna) కు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ (N-Convention Centre) ను హైడ్రా అధికారులు నేలమట్టం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
నాగార్జున, నల్ల ప్రీతమ్ రెడ్డి కలిసి సంయుక్తంగా హైదరాబాద్ మాదాపూర్లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో N-కన్వెన్షన్ సెంటర్ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండగా.. 1.12 ఎకరాలు FTL పరిధిలో, 2 ఎకరాల బఫర్ జోన్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎప్పటి నుంచో వివాదంలో ఉంది. మాదాపూర్లోని చెరువును ఆక్రమించి దీన్ని నిర్మించారన్నది ఆరోపణ. 2014లో కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసి FTLలో నిర్మించారని తేల్చారు. మిగతా నిర్మాణాలను కూల్చిన అధికారులు.. ఈ కన్వెన్షన్ సెంటర్ జోలికి వెళ్ళలేదు.
2016లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెరువును సగం వరకు ఆక్రమించి N కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని సభ దృష్టికి తీసుకెళ్లారు. అక్కినేని నాగార్జున అక్రమ నిర్మాణంపై పేపర్లలో వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని, ఏ శక్తులు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు. తాజాగా రేవంత్ సీఎం అయ్యాక ఆ కన్వెన్షన్ సెంటర్ను ఆయన హైడ్రా ద్వారా కూల్చివేయించారు. నాగార్జున కు చెందిన సెంటర్ నే కూల్చడం తో మిగతా వారిలో భయం మొదలైంది. సమాజంలో పలుకుబడి ఉన్న నాగార్జునను వదలని ప్రభుత్వం..తమను మాత్రం వదిలిపెడుతుందా..? ఖచ్చితంగా అక్రమంగా నిర్మించిన తమ నిర్మాణాలను కూడా కూల్చేస్తుందని భయపడుతున్నారు. హైడ్రా అధికారులు మాత్రం ఎవ్వర్నీ వదిలిపెట్టం అని హెచ్చరిస్తున్నారు.
Read Also : Bank Account Deactivate: బ్యాంక్ ఖాతా ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఆర్బీఐ కొత్త నియమం ఇదే..!