BRO : ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ కలెక్షన్స్
పవన్ కళ్యాణ్ నుండి సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే
- Author : Sudheer
Date : 28-07-2023 - 6:39 IST
Published By : Hashtagu Telugu Desk
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుండి సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే. టాక్ తో సంబధం లేకుండా కలెక్షన్ల సునామి సృష్టించడం ఒక్క పవన్ కళ్యాణ్ కే చెల్లుతుంది. పవన్ సినిమాను చూసేందుకు కేవలం అభిమానులు , సినీ లవర్స్ మాత్రమే కాదు సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు , బిజినెస్ వర్గాల వారు ఇలా అంత కూడా ఫస్ట్ డే చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. దీంతో ఓపెనింగ్స్ పలు రికార్డ్స్ సృష్టిస్తుంటాయి.
ఇక ఇప్పుడు బ్రో (BRO Movie) చిత్రానికి కూడా అదే నడిచింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయాన్నే అభిమానులు , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున థియేటర్స్ కు వెళ్లి బ్రో సినిమాను చూసారు. అంతే కాదు ప్రతి ఒక్కరు కూడా సినిమా సూపర్ హిట్ అంటూ సోషల్ మీడియా వేదికగా చెపుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను సినిమాకు పాజిటివ్ టాక్ నడుస్తుంది. దీంతో అంత కలెక్షన్ల (Bro Collections) ఫై ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ (BRO Overseas Premier Shows) తోనే హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసినట్లు చెపుతున్నారు. అమెరికాలో ప్రీమియర్లను 256 లోకేషన్లలో ప్రదర్శించారు. యూఎస్‌లో 550K డాలర్లకుపైగా, కెనడాలో 70 వేల డాలర్లు వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో మొత్తంగా 650K వసూళ్లను రాబట్టినట్లు సమాచారం.
ఇక తెలుగు రాష్ట్రాల (BRO Telugu States) విషయానికి వస్తే.. తొలి రోజు నైజాంలో 8 కోట్లు, ఏపీలో 15 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, మిగితా రాష్ట్రాల్లో కలిపి 5 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో రికార్డు చేరినట్లే అవుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ లు నటించిన మూవీ బ్రో (BRO). సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు (జులై 28న) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయం ఆటతోనే సూపర్ హిట్ టాక్ రావడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంత కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగగా..సెకండ్ హాఫ్ అంత కూడా ఎమోషనల్ సన్నివేశాలతో సాగింది. ఈ సినిమాను పీపూల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఫై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మించారు.
Read Also : BRO : ఏపీలో ఆ రెండు చోట్ల బ్రో షోస్ ను నిలిపివేశారు…