HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Breaking Akhanda 2 Paid Premieres Canceled All Over India

Akhanda 2 Paid Premieres: ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు.. రీజ‌న్ ఇదే!

ప్రీమియర్ షోలు రద్దు అయినప్పటికీ ఈ సినిమా విడుదల మాత్రం నిలిచిపోలేదు. ఈ చిత్రం భారతదేశంలో రేపటి నుండి (డిసెంబర్ 5) కేవలం సాధారణ షోలతోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Author : Gopichand Date : 04-12-2025 - 7:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akhanda 2 Paid Premieres
Akhanda 2 Paid Premieres

Akhanda 2 Paid Premieres: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ అంచనాల చిత్రం ‘అఖండ 2’ విడుదలకు సంబంధించి ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ రాత్రి దేశవ్యాప్తంగా జరగాల్సిన పెయిడ్ ప్రీమియర్ షోలు (Akhanda 2 Paid Premieres) అన్నీ రద్దు అయ్యాయి. ఈ తాజా, షాకింగ్ అప్‌డేట్‌తో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న బాల‌య్య‌ అభిమానులు, సినీ ప్రేమికులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

సాంకేతిక సమస్యల పేరుతో రద్దు

నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ రద్దుకు ‘సాంకేతిక సమస్యలు’ కారణమని పేర్కొంది. అయితే సినిమా పరిశ్రమలో మాత్రం దీనికి వేరే కారణాలు ఉన్నాయనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఉదయం నుండి సోషల్ మీడియా, సినీ వర్గాలలో కొన్ని నివేదికలు వైరల్ అయ్యాయి. వాటి ప్రకారం.. 14 రీల్స్ ప్లస్ (14 Reels Plus), ఈరోస్ ఇంటర్నేషనల్ (Eros International) మధ్య గత ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక వివాదాలు ఉన్నాయని, వాటి కారణంగానే ఈ ప్రీమియర్‌ షోల విషయంలో సమస్య తలెత్తిందని తెలుస్తోంది. ఈ ఆర్థిక చిక్కుముడుల కారణంగానే ఈ ముఖ్యమైన సమయంలో ప్రీమియర్‌లు ఆగిపోయాయని పలువురు అనుకుంటున్నారు. ఈ రద్దు నిర్ణయం అభిమానులకు, అలాగే విదేశీ ప్రేక్షకుల కంటే ముందే సినిమాను వీక్షించాలని టికెట్లు కొనుగోలు చేసిన న్యూట్రల్ ఆడియన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Also Read: Putin Religion: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పాటించే మతం ఏమిటి? ఆయనకు దేవుడిపై విశ్వాసం ఉందా?

#Akhanda2 Premieres in India scheduled for today are cancelled due to technical issues.

We've tried our best, but a few things are beyond our control. Sorry for the inconvenience.

The overseas premieres will play as per the schedule today.

— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025

రేపటి నుండి సాధారణ విడుదల

ప్రీమియర్ షోలు రద్దు అయినప్పటికీ ఈ సినిమా విడుదల మాత్రం నిలిచిపోలేదు. ఈ చిత్రం భారతదేశంలో రేపటి నుండి (డిసెంబర్ 5) కేవలం సాధారణ షోలతోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విదేశాల్లో జరగాల్సిన ప్రీమియర్ షోలు మాత్రం సమయానికి ప్రారంభమవుతాయని ‘అఖండ 2’ టీమ్ స్పష్టం చేసింది. ఈ పరిణామం భారతీయ ప్రేక్షకుల్లో కొంత అసంతృప్తిని పెంచింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించారు. ఆది పినిశెట్టి, సంయుక్త మీన‌న్‌, హర్షాలీ మల్హోత్రా వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తదుపరి అప్‌డేట్స్, వసూళ్ల వివరాల కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akhanda 2
  • Akhanda 2 Paid Premieres
  • balakrishna
  • boyapati srinu
  • Paid Premieres
  • tollywood

Related News

Attitude Star Chandrahas

నటుడు ప్రభాకర్ కుమారుడు..యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై కేసు నమోదు

Attitude Star Chandrahas  బరాబార్ ప్రేమిస్తా మూవీ హీరో, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ సందర్భంగా ఓ అసభ్యకరమైన పాటను చంద్రహాస్ పాడారు. దానిపై ఓ జర్నలిస్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. జర్నలిస్టుకు కౌంటర్ ఇచ్చిన చంద్రహాస్ అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మాదాపూ

  • Chandrahas Song

    చిత్రసీమను భ్రష్టు పట్టించడానికి ఇలాంటి వాడు ఒక్కడు చాలు !!

  • Eesha Rebba Sensational Comments On Ntr Aravinda Sametha Movie

    అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బా

  • Sai Pallavi

    మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

  • Chiru Vs Balayya

    మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

Latest News

  • టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!

  • కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!

  • చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

  • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

  • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd