Vijay Devarakonda : బోయపాటితో రౌడీ స్టార్.. ఈ కాంబో అస్సలు ఊహించలేదుగా..?
Vijay Devarakonda స్కంద తర్వాత బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమా నందమూరి బాలకృష్ణతో అఖండ 2 చేస్తారని అనుకోగా అఖండ 2 కి కాస్త టైం పట్టేలా ఉందని యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ
- By Ramesh Published Date - 07:01 PM, Fri - 9 February 24

Vijay Devarakonda స్కంద తర్వాత బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమా నందమూరి బాలకృష్ణతో అఖండ 2 చేస్తారని అనుకోగా అఖండ 2 కి కాస్త టైం పట్టేలా ఉందని యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండతో సినిమాకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ తో కలిసి బోయపాటి శ్రీను రీసెంట్ గా ఒక సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా బాలయ్యతో కలిసి చేస్తున్నారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ హీరోగా బాలకృష్ణ కాదు విజయ్ దేవరకొండ అని తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ని పూర్తి చేసి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ తర్వాత గౌతం తిన్ననూరితో సినిమా ఉంది. ఆ నెక్స్ట్ బోయపాటితో సినిమా ఉంటుంది. స్టార్ హీరో అయినా యంగ్ హీరో అయినా బోయపాటి సినిమా అంటే మాస్ యాక్షన్ పుష్కలంగా ఉండాల్సిందే.
విజయ్ దేవరకొండ తో చేసే సినిమా ఎలా ఉంటుంది అన్నది చూడాలి. విజయ్ దేవరకొండ రేంజ్ పెంచేలా బోయపాటి ఈ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ గీతా ఆర్ట్స్ లో సరైనోడు సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను ఈసారి ఎలాంటి సినిమా ఇస్తారో చూడాలి. ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. విజయ్ మార్క్ ఎంటర్టైనర్ తో పాటుగా బోయపాటి మార్క్ మాస్ మూవీగా ఇది రాబోతుందని తెలుస్తుంది.
Also Read : Prabhas Raja Saab : రాజా సాబ్ హైలెట్స్ ఇవే.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ పక్కా..!