Pushpa 2 Stampede Case :అల్లు అర్జున్ అరెస్ట్ పై బోనీకపూర్ రియాక్షన్..
Pushpa 2 Stampede Case : ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్న దీనిపై ఎవరో ఒకరు స్పందిస్తూ వైరల్ చేస్తున్నారు
- By Sudheer Published Date - 04:16 PM, Thu - 2 January 25

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ ఘటన (Stampede Case) ఇప్పటికీ జనంలో చర్చనీయాంశంగా సాగుతుంది. ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్న దీనిపై ఎవరో ఒకరు స్పందిస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ ఘటనపై సినీ పరిశ్రమలోనూ వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) ఈ ఇష్యూ పై స్పందించారు.
Talliki Vandanam Scheme : రాబోయే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ – కేబినెట్ నిర్ణయం
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్(Allu Arjun)ను నేరుగా బాధ్యుడిగా చేయడం సరికాదని బోనీ కపూర్ అభిప్రాయపడ్డారు. తమిళ్, తెలుగు చిత్ర పరిశ్రమల్లో అగ్ర హీరోల సినిమాలకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్ల వద్ద గుమికూడడం సాధారణమైందని అన్నారు. తన నిర్మాణంలో అజిత్ సినిమా విడుదల సమయంలోథియేటర్ వద్ద వేలాది మంది తరలి రావడం తనకే ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.
సంధ్య థియేటర్ ఘటనకు జనసందోహం కారణమని, అల్లు అర్జున్‌ను ఒక్కడినే నిందించడం అన్యాయం అని బోనీ కపూర్ అభిప్రాయపడ్డారు. అలాంటి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నప్పుడు, అన్ని వసతులు సమకూర్చాల్సిన బాధ్యత అన్ని డిపార్ట్మెంట్స్ అని ఆయన అన్నారు. అల్లు అర్జున్ అభిమానులు బోనీ కపూర్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. కొందరు మాత్రం ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని వాదిస్తున్నారు. ఈ ఘటనపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వాన్ని కోరుతోంది.