Sivaji : ఆ నిర్మాత కొడుకు మూవీలో విలన్ గా శివాజీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
- By Sailaja Reddy Published Date - 07:40 PM, Sat - 23 March 24
తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సినిమాలలో హీరోగా, నటుడిగా నటించి మంచి గుర్తింపుని ఏర్పరచుకున్న శివాజీ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ అనే ప్రారంభించిన విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఆడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు. కాగా ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయిన శివాజీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. అందులో భాగంగానే నైంటీస్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు.
ప్రస్తుతం మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలో బిజీబిజీ అవ్వడానికి తెగ ప్రయత్నిస్తున్నారు శివాజీ. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలో విలనిజం ఉన్న పాత్రలో కనిపించబోతున్నారట. గతంలో ఇంద్ర వంటి సినిమాలో శివాజీని నెగటివ్ పాత్రలో చూశాము. అయితే ఈసారి పూర్తిగా సినిమా మొదలు నుంచి విలనిజంతో కనిపించబోతున్నారట. ఇక ఈ చిత్రాన్ని కొండా విజయ్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్నారట. ఈ దర్శకుడు గతంలో గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు.
ఇప్పుడు ఒక నిర్మాత కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ అహం అనే సినిమాని తీసుకు రాబోతున్నారట. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని లాంచ్ చేయనున్నారట. కాగా దర్శకుడు కొండా విజయ్ కుమార్ తన గత రెండు చిత్రాలను లవ్ స్టోరీస్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పుడు ఈ మూవీకి అహం అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు.
Related News
Samantha : అతనికి బర్త్ డే విష్ చేసి ఐలవ్యూ చెప్పిన సమంత..!
Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఏ చిన్న న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. ఎందుకో మీడియాకు ఆమె మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది.