BiggBoss 8 : బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ఎవరంటే..?
శివాజి, అమర్ దీప్ ఇలా పేర్లు వినబడగా ఫైనల్ గా స్టార్ మా ఇంకా బిగ్ బాస్ టీం ఆ ఛాన్స్ వారిద్దరికీ కాకుండా సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ లో వచ్చి టాప్ 6 దాకా ఉన్న
- By Ramesh Published Date - 11:20 PM, Tue - 27 August 24

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సెప్టెంబర్ 1న స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఈ సీజన్ కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నారు. ఇప్పటికే సీజన్ 8 (BiggBoss 8) లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈసారి బుల్లితెర నటులు, జబర్దస్త్ కమెడియన్స్, సోషల్ మీడియా సెలబ్రిటీస్ వీరి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఒకప్పటి హీరో ఒకరు కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా వస్తున్నారని తెలుస్తుంది.
ఐతే బిగ్ బాస్ సీజన్ హోస్ట్ కన్ఫర్మ్ కాగా ఈ సీజన్ బిగ్ బాస్ బజ్ (BiggBoss Buzz) హోస్ట్ ఎవరన్నది కొన్నాళ్లుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. శివాజి, అమర్ దీప్ ఇలా పేర్లు వినబడగా ఫైనల్ గా స్టార్ మా ఇంకా బిగ్ బాస్ టీం ఆ ఛాన్స్ వారిద్దరికీ కాకుండా సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ లో వచ్చి టాప్ 6 దాకా ఉన్న అర్జున్ అంబటి కి ఇస్తున్నారని తెలుస్తుంది.
స్టార్ మా సీరియల్స్ లో తమ మార్క్ నటనతో మెప్పిస్తూ వస్తున్న అర్జున్ (Arjun Ambati) ఈమధ్యనే అగ్ని సాక్షి అనే వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సీరియల్ లో హిట్ అయిన జోడీనే అందులో రిపీట్ చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 బజ్ కి కూడా హోస్ట్ గా అర్జున్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
హౌస్ లో ఏం జరుగుతుందో నాగార్జున చూసుకుంటే బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ని అర్జున్ చూసుకుంటాడు. మరి ఈ సీజన్ ప్లానింగ్ అంతా బాగుండగా షో ఎలా నడుస్తుందో చూడాలి.
Also Read : Nani : సూపర్ హిట్ సీక్వెల్ లో నాని లేకుండానా..?