Nani : సూపర్ హిట్ సీక్వెల్ లో నాని లేకుండానా..?
ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా నానికి చెప్పాడట. నీ క్యారెక్టర్ చనిపోయింది కాబట్టి ఈగ 2 లో మళ్లీ నువ్వు కనిపించవని
- By Ramesh Published Date - 10:37 PM, Tue - 27 August 24

న్యాచురల్ స్టార్ నాని నటించిన ఒక సినిమా సీక్వెల్ లో ఆయన నటించే ఛాన్స్ లేదని అంటున్నారు. అదేమైనా ఫ్రాంచైజ్ లా చేస్తున్నారా అంటే అది కాదు. ఇంతకీ ఏ సినిమా సీక్వెల్ లో నాని అవసరం లేదని అన్నారు. దాని వెనక స్టోరీ ఏంటన్నది చూస్తే.. నాని, సమంత నటించిన ఈగ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని క్యారెక్టర్ ఎండ్ అయితే ఆ తర్వాత ఈగ వస్తుంది.
అప్పట్లోనే ఈగ తో అదిరిపోయే గ్రాఫిక్స్ చేశాడు రాజమౌళి. ఐతే ఎప్పటికైనా ఈగ 2 సినిమా చేస్తానని రాజమౌళి అప్పుడప్పుడు చెబుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈగ 2 తీసినా నాని మాత్రం అందులో ఉండే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా నానికి చెప్పాడట. నీ క్యారెక్టర్ చనిపోయింది కాబట్టి ఈగ 2 లో మళ్లీ నువ్వు కనిపించవని చెప్పాడట.
ఈగ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఈగ 2 లో నాని (Nani) ఉండటం గురించి క్లారిటీ ఇవ్వలేదట. రాజమౌళి చెప్పాడంటే అది కన్ ఫర్మ్ అన్నట్టే లెక్క. ఎలాగు సమంత (Samantha) ఉంటుంది కాబట్టి ఈగ 2 చేస్తే ఈ టైం లో సమంతకు బాగా హెల్ప్ అవుతుంది. ఐతే ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) మహేష్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు.
ఎలా లేదన్నా ఈ సినిమాకు 3 ఏళ్లు టైం పడుతుంది. ఈ సినిమాను రాజమౌళి రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఐదేళ్ల దాకా మహేష్ రాజమౌళిని వదిలేయాల్సిందే.
Also Read : Malavika Mohanan : ప్రభాస్ గురించి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!