Bootcut Balaraju OTT: ఓటీటీలోకి వచ్చేసిన బూట్‌కట్ బాలరాజు.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే?
- By Sailaja Reddy Published Date - 09:00 AM, Tue - 27 February 24
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సోహెల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. బిగ్ ఇకపోతే బస్ హౌస్ కి వెళ్లక ముందు వరకు కూడా సోహెల్ ఎవరు అన్నది చాలా మందికి తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు సోహెల్. ఇక అందరూ అనుకున్న విధంగానే బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా నిలిచి అందరి చేత శభాష్ అనిపించుకోవడంతో పాటు హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత వరుసగా వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు సోహెల్.
ఇటీవల సరికొత్తగా హీరో అవతారం ఎత్తాడు సోహెల్. ఇంతకుముందే మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. తాజాగా సోహెల్ హీరోగా నటించిన నిర్మాతగా వ్యవహరించిన సినిమా బూట్ కట్ బాలరాజు. ఇటీవల ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది శ్రీ కోనేటి తెరకెక్కించిన ఈ మూవీలో మేఘ లేఖ కథానాయికగా నటించింది. వీరితో పాటు సునీల్, సిరి హన్మంతు, ఇంద్రజ, ముక్కు అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. బూట్ కట్ బాలరాజులో హీరోగా నటించడమే కాకుండా సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నాడు సోహైల్. అందుకు తగ్గట్టుగానే గట్టిగా ప్రమోషన్లు కూడా నిర్వహించాడు.
Bootcut Balaraju ke mana votu! ✊
Now Streaming on aha. 🍿👉▶️https://t.co/DAOZyPdhll@RyanSohel #BootcutBalarajuOnAha #Meghalekha @sreekoneti1 #MdPasha #Globalfilms @BootcutBalaraju @SonyMusicSouth pic.twitter.com/O03dvsy8BR— ahavideoin (@ahavideoIN) February 26, 2024
బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరుగానే వసూళ్లు రాబట్టింది. అయితే తాను ఆశించినంత రీతిలో రెస్పాన్స్ రావడంతో సోహైల్ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తానికి థియేటర్లలో యావరేజ్ గా నిలిచింది బూట్ కట్ బాలరాజు. ఇప్పుడీ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సోహైల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26 నుంచి బూట్ కట్ బాలరాజు సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది ఆహా. అందుకు తగ్గట్టుగానే చెప్పిన సమయానికే అంటే సోమవారం ఫిబ్రవరి 26 సాయంత్రం 6 గంటల నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేశాడు బూట్ కట్ బాలరాజు. మరి థియేటర్లలో ఆడియెన్స్ ను నవ్వించిన బూట్ కట్ బాలరాజు ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి మరి.
Related News
Tollywood : ఇండస్ట్రీ లో ఛాన్సులు రావాలంటే దర్శక – నిర్మాతల కోరిక తీర్చాల్సిందే – రమ్యకృష్ణ
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగాలంటే కచ్చితంగా దర్శక-నిర్మాతలు లేదా హీరోల కోరిక తీర్చాల్సిందే అని తేల్చి చెప్పింది. వారి పడకగదిలోకి వెళ్లాల్సిందే..అని అప్పుడే ఛాన్సులు వస్తాయని తెలిపి షాక్ ఇచ్చింది