Pallavi Prashanth: చంచల్ గూడ జైలుకు బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్
బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)ని బుధవారం రాత్రి గజ్వేల్ లో అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. అనంతరం గజ్వేల్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
- Author : Gopichand
Date : 21-12-2023 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
Pallavi Prashanth: బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)ని బుధవారం రాత్రి గజ్వేల్ లో అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. అనంతరం గజ్వేల్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు పల్లవి ప్రశాంత్ ను విచారించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో ప్రశాంత్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమన్నారు పోలీసులు. విచారణ అనంతరం జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు హాజరుపర్చారు. పల్లవి ప్రశాన్త కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుని కూడా పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ పోలీసులు వారిస్తున్న వినకుండా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడంతో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం ఘటనలు జరిగాయని పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ పరారీలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ తాను ఎక్కడికి వెళ్లలేదని ఇంట్లోనే ఉన్నానని.. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తన ఫోన్ ఇంకా స్విచ్ ఆన్ చేయలేదని ప్రశాంత్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో అతని స్వగ్రామానికి వెళ్లిన పోలీసులు బుధవారం అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ ను విధించారు. ఈ కేసుపై విచారణ జరుగుతుందని తెలిపారు.
Also Read: EAGLE Trailer : రవితేజ ‘ఈగల్’ ట్రైలర్ చూశారా? ఈ సారి భారీ రేంజ్‌లో విధ్వంసం..
గత ఆదివారం బిగ్ బాస్ ఫైనల్ తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్, అశ్విని, గీతూ, హర్ష, భోలే కార్లుపై దాడిచేశారు. ఆర్టీసీ బస్సులపైనా రాళ్లదాడి చేశారు. దీంతో ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగిలాయి. ఆ తర్వాత పోలీసుల సూచనల మేరకు చాలాసేపు బిగ్ బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉంచింది. ఆ తరువాత ప్రశాంత్ ను గేటు వెనుక నుంచి బయటకు పంపించేశారు. కానీ, ప్రశాంత్ మాత్రం మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తన కారులో వచ్చాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.
We’re now on WhatsApp. Click to Join.