AAA Theatres: ఫ్యాన్స్ కు పూనకాలే, అల్లు అర్జున్ థియేటర్ లో ఆదిపురుష్ మూవీ
అల్లు అర్జున్ థియేటర్ లో ఆదిపురుష్ మూవీ విడుదల కానుండటంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.
- By Balu J Published Date - 12:51 PM, Thu - 15 June 23
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సొంతంగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు అదిరిపొయే ఫీచర్స్ తో ఎఎంబి థియేటర్ ను ప్రారంభించగా, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ మెయిన్ సెంటర్ లో అధునిక హంగులతో కొత్త థియేటర్ AAA (మల్టీపెక్స్)ను ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే.
అటు ప్రభాస్ అభిమానులు, ఇటు అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ ఇవ్వబోతోంది ఈ మల్టీపెక్స్. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఆదిపురుష్ మూవీ AAAలో కూడా విడుదలకానుండటంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. భూషణ్ కుమార్ నిర్మించిన, ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే ఊహించని రీతిలో అద్భుతమైన ఓపెనింగ్స్ ను సాధించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ థియేటర్ లో రామాయణం కు సంబంధించిన మూవీ విడుదల కానుండటంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త థియేటర్ లో ఆదిపురుష్ సినిమా చూడాలని అటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఉత్సాహం చూపుతున్నారు.
ఏఏఏలో మొత్తం ఐదు స్క్రీన్లు ఉన్నాయి. స్క్రీన్ 1 అనేది 67 అడుగుల ఎత్తు, ఆట్మోస్ (ATMOS) సౌండ్‌తో బార్కో లేజర్ ప్రొజెక్షన్‌తో ఉంటుంది. స్క్రీన్ 2 అట్మోస్ సౌండ్‌తో కూడిన ఎపిక్ (EPIQ)లక్సన్ స్క్రీన్. మిగిలిన స్క్రీన్లు 4K ప్రొజెక్షన్‌ను కలిగి ఉంటాయి, అలాగే అన్ని స్క్రీన్లు డాల్బీ 7.1 సౌండ్‌తో అమర్చబడి ఉన్నాయి.
Also Read: Darling Prabhas: సలార్ టీమ్ కు ప్రభాస్ అదిరిపోయే గిఫ్టులు, రియల్ హీరో అంటూ ప్రశంసల జల్లు!
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది