Bhagavanth Kesari: భగవంత్ కేసరి సాంగ్ అప్ డేట్.. బాలయ్య, శ్రీలీల అదిరే స్టెప్పులు
పోస్టర్‌లో బాలకృష్ణతో పాటు, శ్రీలీల కూడా ఎనర్జిటిక్ నంబర్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
- Author : Balu J
Date : 29-08-2023 - 6:17 IST
Published By : Hashtagu Telugu Desk
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడిల విలక్షణమైన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ భగవంత్ కేసరి నుండి మొదటి సింగిల్ గణేష్ గీతం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. కాగా, ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రేపు విడుదల చేయనున్నారు. పోస్టర్‌లో బాలకృష్ణతో పాటు, శ్రీలీల కూడా ఎనర్జిటిక్ నంబర్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
NBK, శ్రీలీల ఇద్దరూ సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తారు. నేపథ్య నృత్యకారులు కూడా పోస్టర్‌లో కనిపిస్తారు. ఎస్ థమన్ స్వరపరిచిన ఈ పాట గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా వైరల్ అవుతుందని భావిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
కాగా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ప్రవేశంపై ఎన్నో ప్రచారాలు జరిగాయి. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ.. మొదటి చిత్రం ఎలా ఉంటుందని ఫ్యాన్స్‌లో ఎంతో ఆసక్తి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే మోక్షజ్ఞ తొలి సినిమా యాక్షన్ ఓరియేంటెడ్‌గా ఉంటుందని ఒకసారి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తాడని మరోసారి ప్రచారం జరిగింది. నటనపై అమితాసక్తి పెంచుకున్న మోక్షజ్ఞ సినీ ప్రవేశంపై ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రచారాలు జరగడమే కాని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ యువ హీరో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో వేచి చూడాల్సిందే.
Also Read: BRS Party: మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరికలు