Balayya: బాలయ్య మనసు బంగారం.. ఏకంగా రూ.40 లక్షల సాయం!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి, ఆయన మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
- By Anshu Published Date - 09:35 PM, Tue - 14 February 23

Balayya: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి, ఆయన మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాట కొంచెం కఠినంగా ఉన్నా.. మనసు మాత్రం చాలా మంచిది. ఈయనతో పనిచేసిన చాలా మంది ఇదే విషయాన్ని బయట చెబుతూ ఉంటారు. పైకి గంభీరంగా కనిపించినా… బాలయ్య మనసు వెన్న అని ఆయనతో పని చేసిన ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. బాలయ్య సినిమాల్లో బిజీగా ఉంటూనే మరొకవైపు రాజకీయాలలో కూడా రాణిస్తూ ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఓటీటీ లో కూడా టాక్ షో చేస్తున్నారు.
బాలయ్య బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు చైర్మన్‌గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ హాస్పిటల్‌లో క్యాన్సర్‌కి చికిత్సలు అందిస్తూ ఉంటారు. తాజాగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌కి నందమూరి బాలకృష్ణ చేసిన సహాయం గురించి వార్తలు బయటకు రాగా ఆయన మంచి మనసు మరొకసారి నిరూపితైంది. తాను చేసిన మంచి పనిని బాలకృష్ణ బయటకు చెప్పుకోడు. కానీ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆయన చేసిన సహాయం విలువ ఏకంగా రూ.40 లక్షలు. అసలు అంత పెద్ద సాయాన్ని బాలకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఎందుకు చేశారనే విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.
డైరెక్టర్ బోయపాటి శ్రీను దగ్గర మహేష్ యాదవ్ అనే యువకుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వినయ విధేయ రామ చిత్రానికి పనిచేశాడు. తనకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తే దానిని తొలగించడానికి ఆపరేషన్ చేయాలని, దాని ఖర్చు రూ.40 లక్షల అవుతుందని చెప్పారట. కానీ మహేష్ దగ్గర అంత డబ్బు లేదు. ఈ విషయం దర్శకుడు బోయపాటి శ్రీనుకి తెలిసింది. బాలకృష్ణతో ఆయనకున్న మంచి అనుబంధంతో బోయపాటి బాలకృష్ణకు ఈ విషయం చెప్పగా ఆయన తన బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్‌లో ఎటువంటి డబ్బులు తీసుకోకుండా బ్రెయిన్ ట్యూమర్‌ని తొలగించారు. ఒకరకంగా చూసుకున్నట్లయితే ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌కి బాలకృష్ణ 40 లక్షల రూపాయల సహాయాన్ని అందించినట్లే కదా. ఏది ఏమైనా బాలయ్య అభిమానులు ఆయనపై మరొకసారి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.