HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Balayyas Akhanda 2 Ott Release Date Is Fixed

బాలయ్య అఖండ 2 ఓటిటి డేట్ ఫిక్స్..

  • Author : Vamsi Chowdary Korata Date : 03-01-2026 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akhanda 2 Thaandavam Ott
Akhanda 2 Thaandavam Ott

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ 2 తాండవం’ చిత్రం థియేటర్లో మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ జనవరి 9న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో అంతగా మెప్పించని ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ సీక్వెల్ మూవీ ‘ అఖండ 2 తాండవం’ గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగేళ్ల క్రితం విడుదలైన ‘అఖండ’కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, పూర్ణ, హర్సాలి కీలక పాత్రలు పోషించగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. 14 రీల్స్ ప్లస్, పతాక బ్యానర్లపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్స్ సమస్యల కారణంగా డిసెంబర్ 12కి వాయిదా పడింది. ఈ ఆలస్యం సినిమాపై నెగటివ్ ప్రభావాన్ని చూపిందనే అభిప్రాయం వినిపించింది.

ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన ‘అఖండ 2’కు ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల్లో చాలా మంది నిరాశకు గురయ్యారు. బాలయ్య అభిమానులే ఆశించిన స్థాయిలో సినిమా లేదని పెదవి విరిచిన సందర్భాలు కనిపించాయి. ముఖ్యంగా పార్ట్ 1తో పోలిస్తే కథ, టేకింగ్, ఎమోషనల్ హై పాయింట్స్ ఆశించినంతగా వర్క్ అవ్వలేదన్న విమర్శలు వచ్చాయి. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడంతో భారీ ఆశలు పెట్టుకున్నారు. శివతత్వం, సనాతన ధర్మం నేపథ్యంగా కథ సాగడంతో నార్త్ ఇండియా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ అంచనాలు నెరవేరలేదు.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ పరంగా క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. థియేట్రికల్ రన్ దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో ‘అఖండ 2’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోందట. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ప్రకారం జనవరి 9వ తేదీ నుంచి ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా భాషల్లో ఓటీటీలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో థియేటర్లలో మిస్ అయిన ఆడియెన్స్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సినిమాను ఎలా ఆదరిస్తారా అనే ఆసక్తి నెలకొంది.

కలెక్షన్ల విషయానికి వస్తే, ‘అఖండ 2’ థియేటర్లలో ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. విడుదలై 22 రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ.121 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.95 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.7 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు రూ.5 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా చూస్తే దాదాపు రూ.70 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు థియేట్రికల్ బిజినెస్ రూ.103–104 కోట్లుగా ఉండటంతో, బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.30 కోట్లకు పైగా షేర్ అవసరం ఉంది. ప్రస్తుతం రోజువారీ కలెక్షన్లు చాలా తక్కువగా ఉండటంతో థియేట్రికల్ రన్‌లో బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓటీటీ రిలీజ్ తర్వాత అయినా ‘అఖండ 2’కు కొత్త రీచ్ వస్తుందేమో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akhanda 2
  • Akhanda 2 Thaandavam
  • Balakrishna Boyapati movie
  • nandamuri balakrishna
  • Netflix
  • ott
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

  • Mega Power Star Ram Charan's 'Peddi' – the official announcement is out; here’s where it will stream.

    Peddi OTT: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd