Balakrishna & Pawan Combo : ఆ డైరెక్టర్ చేసిన చిన్న పొరపాటు..పవన్ – బాలయ్య ల మల్టీస్టారర్ ఆగిపోయేలా చేసింది
బాలకృష్ణ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను ఒకే ఫ్రెమ్ లో చూడాలని మెగా అభిమానులు , నందమూరి అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు
- By Sudheer Published Date - 03:28 PM, Mon - 22 July 24

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మల్టీస్టారర్ (Multi Starrer) కథలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో NTR , ANR , కృష్ణ వంటి తరంలో మల్టీస్టారర్ చిత్రాలు ఓ ఊపు ఉపేయగా..ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. అయితే మళ్లీ సినీ లవర్స్ కు మల్టీస్టారర్ రుచి చూపించాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. మహేష్ – వెంకటేష్ లను పెట్టి సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు మూవీ ని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు శ్రీకాంత్. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలు , చిన్న హీరోలు ఇలా అందరు కలిసి సినిమాలు చేయడం స్టార్ట్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా నందమూరి బాలకృష్ణ (Balakrishna) , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) లను ఒకే ఫ్రెమ్ లో చూడాలని మెగా అభిమానులు , నందమూరి అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. అయితే వీరికి కరెక్ట్ గా సరిపోయే కథను ఓ అగ్ర నిర్మాత దగ్గరకు ఓ డైరెక్టర్ తీసుకొచ్చాడట. ఆ కథ విన్న తర్వాత సదరు నిర్మాత సూపర్..ఏమన్నా కథ ఉందా..వెంటనే ఈ కథ వారికీ చెపితే ఈజీ గా ఓకే చేస్తారని ఇద్దరు భావించారు. ముందుగా బాలకృష్ణ కు కథ చెప్పి..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు చెప్పి ఎలాగైనా ఓకే చేయిద్దాం అనుకున్నారట. ఇక బాలకృష్ణ వద్దకు ముందుగా వెళ్లి కథ చెప్పారట. అయితే డైరెక్టర్ కాస్త కన్‌ఫ్యూజ్ అయి… చెప్పాల్సిన కథని సరిగా చెప్పలేకపోయాడట. దాంతో బాలకృష్ణ ‘ఇదేం కథ… నాకు నచ్చలేదు’ అంటూ మొహమాటం లేకుండా పక్కన పెట్టేశాడు.
నిజానికి ఆ కథపై నిర్మాతతో పాటు అందరికీ మంచి గురి ఉంది. బాలయ్య – పవన్‌లకు తప్ప మరే హీరోలకూ సరిపోదు. ఇక్కడ చూస్తే తొలి అడుగులోనే భంగపాటు ఎదురైంది. బాలయ్య ఓకే అంటే.. అట్నుంచి అటు పవన్‌కు చెప్పి ఒప్పించేద్దురు. కానీ దర్శకుడు ఆ కథని సరిగా చెప్పలేకపోవడం వల్ల ఓ మంచి కాంబో చూసే అవకాశం లేకుండా పోయింది. కానీ నిర్మాత మాత్రం కథ ను కాస్త చేంజెస్ చేసి మరోసారి వినిపించాలని భావిస్తున్నాడట. చూద్దాం మరి బాలయ్య – పవన్ కాంబో సెట్ అవుతుందో..!!
Read Also : Vijay : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌ని ఫాలో అవుతున్న విజయ్..? పాదయాత్రతో జనాల్లోకి..