Anupama Parameswaran : స్టార్ తనయుడితో అనుపమ.. సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు..!
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) తెలుగులో తన మార్క్ సినిమాలతో అలరిస్తుంది. స్టార్ రేంజ్ కటౌట్ అయినా కూడా అమ్మడు ఎందుకో టైర్ 2 హీరోలతోనే
- By Ramesh Published Date - 01:17 PM, Tue - 12 March 24

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) తెలుగులో తన మార్క్ సినిమాలతో అలరిస్తుంది. స్టార్ రేంజ్ కటౌట్ అయినా కూడా అమ్మడు ఎందుకో టైర్ 2 హీరోలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రీసెంట్ గా రవితేజ ఈగల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుపమ ఈ నెల చివరన టిల్లు స్క్వేర్ తో రాబోతుంది. ఈ సినిమాలో అనుపమ రెచ్చిపోవడం గురించి అందరికీ తెలిసిందే. ట్రైలర్ చూసినప్పటి నుంచి టిల్లు స్క్వేర్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటుగా తెలుగులో మరో సినిమా సైన్ చేసిన అనుపమ లేటెస్ట్ గా కోలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తుందని తెలుస్తుంది. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రం తనయుడు ధృవ్ హీరోగా వస్తున్న సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది. ఆదిత్య వర్మ, మహాన్ సినిమాల తర్వాత కెరీర్ పరంగా గ్యాప్ తీసుకున్న ధృవ్ త్వరలో నెక్స్ట్ సినిమా మొదలు పెడుతున్నాడు.
ఈ సినిమాను అప్లాస్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. మామన్నన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మారి సెల్వరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమా లో ధృవ్ అనుపమ రొమాన్స్ కూడా ఆడియన్స్ ని అలరిస్తుందని అంటున్నారు. మరి అనుపమ సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొట్టేస్తుండగా ధృవ్ తో చేస్తున్న ఈ సినిమాలో ఎలాంటి పాత్రతో మెప్పిస్తుందో చూడాలి.
Also Read : Kumari Aunty : సీరియల్స్ కి పాకిన కుమారి ఆంటీ క్రేజ్.. ఆ సూపర్ హిట్ సీరియల్ లో షాకింగ్ ఎంట్రీ..!