Kumari Aunty : సీరియల్స్ కి పాకిన కుమారి ఆంటీ క్రేజ్.. ఆ సూపర్ హిట్ సీరియల్ లో షాకింగ్ ఎంట్రీ..!
- By Ramesh Published Date - 01:04 PM, Tue - 12 March 24
Kumari Aunty ఫుడ్ కోర్ట్ నడిపే కుమారి ఆంటీ అంటే సోషల్ మీడియాలో తెలియని వారుండరు. నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో సూపర్ పాపులర్ అయిన కుమారి ఆంటీ క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. సోషల్ మీడియా లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఫుడ్ స్టాల్ ని పోలీసులు తీసేయాలని అనుకోవడం ఆ టైం లో సీఎం రేవంత్ కూడా ఆమెను వదిలేయండి అనడం తో ఆమె మరింత పాపులర్ అయ్యింది.
సోషల్ మీడియాలో ఎవరు పాపులర్ అవుతారో వారిని బుల్లితెర వాళ్లు వాడుకోవడం కామనే. ఇప్పుడు అదే పంథాలో కుమారి ఆంటీని వరుస ఛానెల్స్ వారంతా వాడుకుంటున్నారు. రీసెంట్ గా స్టార్ మా లో ఒక ఈవెంట్ లో కుమారి ఆంటీ కనిపించి అలరించింది. స్టార్ మా ఒక ఈవెంట్ కి కుమారి ఆంటీని తీసుకు రాగా ఇప్పుడు జీ తెలుగు వారు ఏకంగా సీరియల్ లోనే ఆమెను తీసుకున్నారు.
రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ లో ఈశ్వరికి సపోర్ట్ గా కుమారి ఆంటీని రంగంలోకి దింపారు సీరియల్ మేకర్స్. కుమారి ఆంటీ క్రేజ్ ని సీరియల్స్ లో కూడా వాడేస్తున్నారు. తప్పకుండా ఆమె మునుముందు ఇంకా బాగా కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.