Anupama Parameswaran: అతన్ని అన్నయ్య అని పిలిచిన అనుపమ.. అలా పిలవద్దు అన్న రవితేజ?
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
- Author : Anshu
Date : 04-02-2024 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ సినిమాలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల ఇంకా పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా కేవలం మూవీలోని కొంతమంది యాక్టర్స్ తో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఒక చిన్న పార్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..
#TFNReels: అందమైన అమ్మాయిలు అన్నయ్య అనకూడదు😂
Mass Maharaja @RaviTeja_offl and @pnavdeep26 hilarious fun with @anupamahere during #EAGLE movie special chit chat.#RaviTeja #Navdeep #AnupamaParameswaran #TeluguFilmNagar pic.twitter.com/DUtvzlH3m7— Telugu FilmNagar (@telugufilmnagar) February 3, 2024
డైరెక్టర్ కార్తీక్ అన్నయ్య అంది. దీంతో రవితేజ నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా అంటూ ఒక వెరైటీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. వెంటనే బేసిగ్గా అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే వర్డ్ వాడకూడదు. నేను ఎందుకు చెప్పానో, ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకో అని అన్నాడు. వెంటనే అనుపమ నేను అతనితో కలిసి నాలుగో సినిమా చేస్తున్నాను. మా మధ్య ర్యాపో ఉండి అలా పిలుస్తున్నాను అంది. అయితే మేము మూడు సినిమాలు మీతో చేసి ఆపేస్తాం అని కౌంటర్ ఇచ్చాడు అవసరాల శ్రీనివాస్. ఇక నవదీప్ కార్తీక్ ఎంత బాధపడుతున్నాడో నువ్ అన్నయ్య అంటున్నావని అని అన్నాడు. ఈ ఇంటర్వ్యూ ఇలా సరదాగా సాగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.