Chiranjeevi – Anil Ravipudi : పండగ పూట మొదలుపెట్టబోతున్న అనిల్ రావిపూడి – చిరంజీవి..
శ్రీకాంత్ ఓదెల సినిమాకు టైం పడుతుంది కాబట్టి ఈ లోపు అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మెగాస్టార్.
- By News Desk Published Date - 10:49 AM, Wed - 26 March 25

Chiranjeevi – Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. ఇది అయ్యాక చిరంజీవికి అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల తో సినిమాలు ఉన్నాయి. శ్రీకాంత్ ఓదెల నానితో పారడైజ్ సినిమాలో ఉన్నాడు కాబట్టి ఆ సినిమాకు టైం పడుతుంది అని ఈ లోపు అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మెగాస్టార్.
చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాని సాహు గారపాటితో పాటు చిరు కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం మార్చ్ 30న ఉగాది నాడు చేయనున్నట్టు సమాచారం. ఉగాది రోజు అధికారికంగా పూజా కార్యక్రమాలతో సినిమా అనౌన్స్ చేసి జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
అనిల్ రావిపూడి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు. అనిల్ చాలా ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేస్తారు. అందుకే అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమా అక్టోబర్ వరకు షూట్ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. ఇది కూడా అనిల్ సినిమాల తరహాలోనే కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఉండనుంది. చిరంజీవిని చాలా రోజుల తర్వాత ఫుల్ కామెడీ పాత్రలో చూడబోతున్నామని సమాచారం. ఇక ఈ సినిమాలో అదితి రావు హైదరి, అంజలి పేర్లు హీరోయిన్స్ గా వినిపిస్తున్నాయి.
Also Read : Nani : హీరోగానే కాదు నిర్మాతగా కూడా ఆ రికార్డ్ సెట్ చేసిన నాని..