NTR Devara: ఎన్టీఆర్ దేవర బదులు విజయ్ వస్తున్నాడా?
ఎన్టీఆర్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న మూవీ కావడం.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో దేవర
- By Praveen Aluthuru Published Date - 11:25 PM, Mon - 22 January 24

NTR Devara: ఎన్టీఆర్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న మూవీ కావడం.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో దేవర పై అంచానలు భారీగా ఉన్నాయి. ఇటీవల దేవర నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో దేవర సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ కు వచ్చిన ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమాను కొరటాల తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్టుగా షూటింగ్ కి ముందే ప్రకటించారు. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ తో మరోసారి ఏప్రిల్ 5న విడుదల అని ప్రకటించారు. అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానలకు ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందనే టెన్షన్ స్టార్ట్ అయ్యింది. దేవర వాయిదా పడడం ఏంటి అనుకుంటున్నారా.
ఏప్రిల్ 5 కు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. అదే కనుక జరిగితే దేవర వాయిదా పడడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ప్రచారంలో ఉన్నట్టుగా దేవర వాయిదా పడితే.. దేవర రిలీజ్ డేట్ కి దేవరకొండ వచ్చేందుకు రెడీ అవుతున్నాడట. మేటర్ ఏంటంటే.. విజయ్ దేవరకొండ నటిస్తోన్న మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రానికి పరశురామ్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండకు జంటగా మృణాల్ ఠాగూర్ నటిస్తోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమాను అసలు సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు దేవర రాకపోతే.. దేవరకొండ వస్తాడటని టాక్. మరి.. ఏప్రిల్ 5న దేవర వస్తాడో.. దేవరకొండ వస్తాడో.. చూడాలి.
Also Read: Ram Mandir: అయోధ్య రామమందిరంపై విషం కక్కిన పాకిస్థాన్