Amitabh Injured: ప్రాజెక్ట్ కే షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కు గాయాలు
ప్రాజెక్ట్ కె షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్ కు గాయాలైనట్టు సమాచారం.
- Author : Balu J
Date : 06-03-2023 - 12:34 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ప్రతిష్టాత్మకమైన మూవీ ప్రాజెక్టు కే లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ కే షూటింగ్ కొనసాగుతోంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్ కు గాయాలైనట్టు సమాచారం. తన కుడి పక్కటెముకకు కండరాలు చిట్టినట్టు తెలుస్తోంది. 80 ఏళ్ల స్టార్ పై యాక్షన్ షాట్ చిత్రీకరిస్తున్నప్పుడు పక్కటెముకలు కదిలి గాయాలయ్యాయి.
అయితే వెంటనే వైద్య పరీక్షలు జరిపి ముంబైకు తరలించారు. ప్రస్తుతం తన నివాసంలో అమితాబ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అవును చాలా బాధాకరమైంది. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది అంటూ సోషల్ మీడియా ద్వారా (Amitabh Bachchan) తెలియజేశాడు. అయితే శరవేగంగా కొనసాగుతున్న షూటింగ్ నుంచి వైదొలగడంతో ప్రాజెక్టు టీం ఆందోళనలో పడింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంది.
ఇక పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్. మరి ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
Also Read: NTR 30 Big Update: జాన్వీ కపూర్ ‘బర్త్ డే’ సర్ ప్రైజ్.. NTR 30లో హీరోయిన్ గా ఫిక్స్!