NTR 30 Big Update: జాన్వీ కపూర్ ‘బర్త్ డే’ సర్ ప్రైజ్.. NTR 30లో హీరోయిన్ గా ఫిక్స్!
ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సై అంటోంది. ఇప్పటికే మేకర్స్ ఆమె పోస్టర్ ను విడుదల చేశారు.
- By Balu J Published Date - 12:21 PM, Mon - 6 March 23

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ 30 మూవీ కోసం కొరటాల శివతో కలిసి పనిచేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించినప్పటి నుండి అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీ సూపర్ హిట్ కావడమే అందుకు కారణం. ఈ నెలాఖరులో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమవుతుందని, ఆ తర్వాత వెంటనే సెట్స్‌పైకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.
అయితే ఇవాళ మేకర్స్ క్రేజీ అప్‌డేట్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు, ఆమెకు (Janhvi Kapoor) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ బ్యూటీ ఎన్టీఆర్ లెజెండ్ అని, ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంటుందని (Janhvi Kapoor) చెప్పింది. ఉత్కంఠ రేపుతున్న ఈ కాంబినేషన్ ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
ఎన్టీఆర్ 30 కేవలం యాక్షన్ (Action)పై మాత్రమే కాకుండా బలమైన భావోద్వేగాలను కూడా ఉంటాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీని, ప్రొడక్షన్ డిజైన్‌ను సాబు సిరిల్ హ్యాండిల్ చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు.
Also Read: Khushboo Sundar: 8 ఏళ్ల వయసులోనే నా తండ్రి వేధించాడు: ఖుష్బూ సుందర్

Related News

Samantha Shaakuntalam: ఎన్టీఆర్ స్పూర్తి.. సమంత కోసం 14 కోట్ల బంగారం
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గుణశేఖర్.