Chiru Birthday : ”వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్” అంటూ అల్లు అర్జున్ ట్వీట్..దారికి వచ్చినట్లేనా..?
Chiru Birthday : "వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్" చిరంజీవికి బర్త్ డే శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి
- By Sudheer Published Date - 11:39 AM, Fri - 22 August 25

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈరోజు తన 70వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెగా అభిమానులు ఆయన పుట్టినరోజును అట్టహాసంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా అంతా అభిమానులు తయారు చేసిన వీడియోలు, పోస్టర్లతో నిండిపోయింది. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా థియేటర్లలో ‘స్టాలిన్’ సినిమాను మరోసారి విడుదల చేశారు. ఈ రీ-రిలీజ్‌కు అభిమానుల నుంచి అపూర్వ స్పందన లభించింది. పాత చిత్రాలను మళ్లీ తెరపై చూస్తూ అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.
Chiru Birth Day : జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు అంటూ పవన్ కు చిరంజీవి రిప్లయ్
మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ప్రముఖులు, సినీ తారలు ఉన్నారు. వారిలో మెగాస్టార్ మేనల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఉన్నారు. “వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్” చిరంజీవికి బర్త్ డే శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా, లోపల మనస్పర్థలు ఉన్నాయని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది, ఈ వార్తలకు ముగింపు పలికింది.
మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ (X) వేదికగా ఆయన ట్వీట్ చేస్తూ, “చిరంజీవి గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా రంగంలో, ప్రజా జీవితంలో మీ అద్భుతమైన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది” అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు చిరంజీవి దాతృత్వం, అంకితభావాన్ని కొనియాడారు. ఆయన చాలా మంది జీవితాలను ప్రభావితం చేశారని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.
Parliament : మరోసారి పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. గోడ దూకి లోపలికి వెళ్లిన ఆగంతుకుడు..!
ఈ సందర్భంగా చిరంజీవికి మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, రాబోయే సంవత్సరాలు మరింత చిరస్మరణీయం కావాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఇలా అనేక మంది చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇది చిరంజీవి వ్యక్తిత్వం, ఆయనపై సమాజంలో ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. తన 70వ పుట్టినరోజున చిరంజీవి పొందిన శుభాకాంక్షలు ఆయన సాధించిన ఘన విజయాలకు, ప్రజాదరణకు నిదర్శనం.
Wishing Megastar Chiranjeevi Garu a very happy 70th birthday. Your remarkable journey in cinema, public life, and philanthropy has inspired millions. May you continue to touch lives with your generosity and dedication. Wishing you good health, happiness, and many more memorable… pic.twitter.com/ZrflnlZnFG
— N Chandrababu Naidu (@ncbn) August 22, 2025
Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu. ⭐️ @KChiruTweets pic.twitter.com/0n9veF0l9X
— Allu Arjun (@alluarjun) August 22, 2025