Allu Arjun and Sneha: హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. స్నేహారెడ్డికి అల్లు అర్జున్ విషెస్!
అల్లు అర్జున్ (Allu Arjun) తన సతీమణి స్నేహారెడ్డికి ట్విటర్ వేదికగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
- By Balu J Published Date - 05:05 PM, Mon - 6 March 23

Allu Arjun and Sneha: టాలీవుడ్ బెస్ట్ కపుల్ లో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహరెడ్డి జంట అందర్నీ ఆకర్షిస్తోంది. పార్టీలు, ఫంక్షన్లు, టూర్స్ కు వెళ్తూ తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఇక ఐకాన్ స్టార్ కు ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో గడిపేందుకు ఆసక్తి చూపుతుంటాడు. పిల్లలు, భార్యతో కలిసి వీకెండ్స్ టూర్స్ కు వెళ్తుతుంటాడు. అయితే ఇవాళ ఈ జంట మ్యారేజ్ డే. అల్లు అర్జున్ (Allu Arjun) తన సతీమణి స్నేహారెడ్డికి ట్విటర్ వేదికగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ’ అని పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా అల్ ఓవర్ ఇండియాను దున్నేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మాంచి ఊపుముందున్నాడు. ఇదే ఊపులో పుష్ప2 కూడా లైన్లో పెట్టేసి సూపర్ డూపర్ హైలెవెల్ లో రికార్డులు కొల్లగొట్టాలని సిద్దమవుతున్నాడు. ఇక, బన్నీ (Allu Arjun) కెరీర్ లోనే కాదు ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేయడంలో కూడా మంచి మార్కులే కొట్టేశాడు. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ ఇప్పటికీ అంతే ప్రేమగా ఫ్యామిలీ కోసం టైం కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు.
Also Read: 4 Tiger Cubs: అవి పిల్లులు కాదు.. పులి పిల్లల్లు!

Related News

Allu Arjun: ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న బన్నీ.. అల్లు అర్జున్ ఎమోషనల్ లెటర్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో. టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ఆయనతో సినిమాలు చేయటానికి అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. ఆయన కూడా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన ఇమేజ్‌ను రోజు రోజుకీ పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు.