Allu Sneha Reddy : పిల్లలతో క్యూట్ రీల్ చేసిన అల్లు స్నేహ రెడ్డి.. వీడియో వైరల్..
తాజాగా అల్లు స్నేహారెడ్డి, అయాన్, అర్హ ముగ్గురు కలిసి ఒక క్యూట్ రీల్ చేసారు.
- Author : News Desk
Date : 22-09-2024 - 3:26 IST
Published By : Hashtagu Telugu Desk
Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన పిల్లలు, ఫ్యామిలీకి చెందిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. బన్నీ ఫ్యాన్స్ స్నేహారెడ్డిని మాత్రం కచ్చితంగా ఫాలో అవుతారు. అర్హ, అయాన్ క్యూట్ ఫొటోలు, వీడియోలు స్నేహ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అవి వైరల్ అవడం షరా మాములే.
తాజాగా అల్లు స్నేహారెడ్డి, అయాన్, అర్హ ముగ్గురు కలిసి ఒక క్యూట్ రీల్ చేసారు. ముగ్గురు మూడు ఫోన్స్ లో తలో వైపు నిల్చొని వీడియో తీశారు. ఆ మూడు వీడియోలను కలుపుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఎవరు ఎవర్ని చూస్తున్నారు అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా క్యూట్ వీడియో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఆ రీల్ చూసేయండి..
ఇక నేడు డాటర్స్ డే అని స్నేహారెడ్డి తన కూతురు అర్హతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను పోస్ట్ చేసి హ్యాపీ డాటర్స్ డే అంటూ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త యాడ్ చూశారా..? బట్టల షాపింగ్ మాల్ కి..