Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త యాడ్ చూశారా..? బట్టల షాపింగ్ మాల్ కి..
ఇప్పటికే పలు యాడ్స్ చేసిన విశ్వక్ సేన్ తాజాగా మరో యాడ్ చేసాడు.
- By News Desk Published Date - 02:59 PM, Sun - 22 September 24

Vishwak Sen : దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను సినీ పరిశ్రమలో ఉన్న అందరూ కచ్చితంగా ఫాలో అవుతారు. కొంచెం పేరు రాగానే యాడ్స్, ఈవెంట్స్, షాప్ ఓపెనింగ్స్ చేసి డబ్బులు వెనకేసుకుంటారు. ఇప్పుడున్న యువ హీరోలు, హీరోయిన్స్ అంతా అదే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు యాడ్స్ చేసిన విశ్వక్ సేన్ తాజాగా మరో యాడ్ చేసాడు.
విశ్వక్ సేన్ తాజాగా CMR షాపింగ్ మాల్ కి దసరా, దీపావళి ఆఫర్స్ కోసం ఒక యాడ్ చేసాడు. ఈ యాడ్ లో కమిటీ కుర్రాళ్ళు సినిమా ఫేమ్ త్రినాథ్ వర్మ, విషిక కూడా నటించారు. దీంతో విశ్వక్ ఫ్యాన్స్ ఈ యాడ్ ని వైరల్ చేస్తున్నారు. మీరు కూడా ఆ యాడ్ చూసేయండి..
ఇక విశ్వక్ త్వరలో మెకానిక్ రాకీ సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. ఇటీవలే దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, కొరటాల శివను విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ కలిసి ఇంటర్వ్యూ చేసారు.
Also Read : Saree Movie Song : ఆర్జీవీ నుంచి మరో హాట్ సాంగ్.. ‘శారీ’ సినిమా ఫస్ట్ సాంగ్ చూశారా..?