Allu Arjun : తెలుగు వారికీ ఛాన్స్ ఇస్తే కదా..ఇండస్ట్రీ లోకి వచ్చేది..?
తెలుగు చిత్రసీమలోకి తెలుగు అమ్మాయిలు రావాలని పిలుపునిచ్చారు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్.
- By Sudheer Published Date - 12:37 PM, Fri - 21 July 23

తెలుగు చిత్రసీమలోకి (Tollywood Industry) తెలుగు అమ్మాయిలు రావాలని పిలుపునిచ్చారు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. బేబీ (Baby) సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలు చేసారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు హీరోయిన్స్ గా వస్తున్నారు. ఎదుగుతున్నారు. మన తెలుగులో మాత్రం తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా లేరు. మన తెలుగు అమ్మాయిలు కనీసం 50 % శాతం ఉండాలి కదా… అవార్డు ఫంక్షన్స్ లో తెలుగు హీరోయిన్స్ ప్రాతినిథ్యం లేదే అని బాధ కలుగుతుంది అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.
అయితే అసలు తెలుగు వారికీ ఛాన్స్ ఇస్తే కదా..వచ్చేది. తెలుగు వారిని పక్కన పెట్టి ఇతర భాషల వారికీ ఛాన్స్ ఇస్తుంటే తెలుగు అమ్మాయిలు ఎక్కడి నుండి వస్తారు..ఎలా ఇంట్రస్ట్ చూపిస్తారని అని ఇప్పుడు అంత ప్రశ్నింస్తున్నారు. మొదటి నుండి కూడా టాలీవుడ్ (Tollywood Industry)లో తెలుగు అమ్మాయిలు తక్కువే. ఈ మధ్య మరి ఎక్కువై పోయింది. ఎక్కువగా నార్త్ నుండే హీరోయిన్లను ఎంపిక చేయడం..భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఇద్దరు , ముగ్గురు తెలుగు వారికీ అసలు పిలిచే నాధుడు లేకపోవడం తో ఇతర భాషల్లో వారు ఛాన్సులు రాబట్టుకొని రాణిస్తున్నారు.
అంజలి, శ్రీదివ్య, బిందు మాధవి లు తమిళంలో సక్సెస్ అయ్యారు. తమిళ పరిశ్రమ వాళ్ళను అక్కున చేర్చుకుంది. తమిళ్ లో గుర్తింపు వచ్చాక అంజలికి తెలుగులో అవకాశాలు వచ్చాయి. శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. ఈషా రెబ్బా లాంటి అందం, అభినయం ఉన్న అమ్మాయికి… ఆదరణ లేకుండా పోయింది. కనీసం సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. స్టార్స్ సంగతి పక్కన పెడితే చిన్న హీరోలు సైతం తెలుగు హీరోయిన్ల ఫై పెద్దగా ఫోకస్ చేయడం లేదు. వారు కూడా ఇతర భాషల అమ్మాయిలనే కోరుకుంటున్నారు. ఇలా అంత తెలుగు అమ్మాయిలను వద్దంటే..ఇక కొత్త అమ్మాయిలు ఎక్కడి నుండి వస్తారని అంత అల్లు అర్జున్ (Allu Arjun) ను ప్రశ్నింస్తున్నారు.
Read Also : Samajavaragamana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సామజవరగమన, స్ట్రీమింగ్ ఎప్పుడంటే!